ప్రత్యేకం హోమ్

ముగ్గురు అమ్మాయిలు ఆంధ్రా పేరును నిలబెట్టారు!

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన దార్శనిక సంస్కరణలు నేడు సంచలనాత్మక ఫలితాలను అందిస్తున్నాయి. విద్యార్థులను కేవలం పాసయ్యి సర్టిఫికెట్లు తీసుకొనేవారిలా కాకుండా, అత్యున్నత నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తూ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయస్థాయి ఐటీఐ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.

కూటమి ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యల ఫలితంగా 17 మంది రాష్ట్ర విద్యార్థులు వివిధ ట్రేడ్లలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సత్కారం అందుకునే చారిత్రక గౌరవాన్ని దక్కించుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘కౌశల దీక్షాత్ సమరోహ్’ వేడుక ఈ అపూర్వ ఘట్టానికి వేదికైంది.

ప్రధాని ప్రశంసలు అందుకున్న ప్రతిభా మూర్తులు
జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఇనుమడింపజేసిన ఆ ముగ్గురు విద్యార్థులు:

  • పి. మధులత (R&AC TECHNICIAN)
  • డి. వందన (PAINTER GENERAL)
  • ఎస్. యామిని వరలక్ష్మి (WOOD WORK TECHNICIAN)

ఈ యువ టాపర్లు పొందిన సన్మానం, రాష్ట్రంలో నైపుణ్య శిక్షణకు లభించిన జాతీయ గుర్తింపుగా పరిగణించాలి. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాల కోసం పోటీ పడగలిగేలా, మంత్రి లోకేష్ ఐటీఐ కాలేజీలను పరిశ్రమలతో నేరుగా అనుసంధానించారు. వారికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక, ఆచరణాత్మక శిక్షణను ప్రభుత్వం అందించడం ఈ విజయానికి ప్రధాన కారణం.

జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి లోకేష్ హృదయపూర్వకంగా అభినందించారు. దేశ, విదేశీ అగ్రగామి కంపెనీలతో కలిసి రాష్ట్ర విద్యార్థుల్లో నైపుణ్యం మరింత పెంపొందించేందుకు కృషి చేస్తామని, తద్వారా ప్రపంచ వేదికపై ఏపీ యువత అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ అపూర్వ విజయం ఆంధ్రప్రదేశ్ యువతరం సాధించిన ఘనత మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. భవిష్యత్తులో మన విద్యార్థులు ప్రపంచ ఉపాధి మార్గాలకు రాజమార్గం వేయబోతున్నారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి!

ఇటీవలే పాలిటెక్నిక్ కళాశాలలో 93% పైగా విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్. తాజాగా ఈ విజయం. ఒక చదువుకున్న యువకుడు మంత్రిగా వచ్చి ప్రోత్సహిస్తే.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు మన విద్యార్థులు. ఇదీ కావాల్సింది లోకేశ్. 17 మందికీ అభినందనలు.

Related posts

‘స్త్రీ శక్తి’ తో మహిళలకు ఆర్థిక చేయూత

Satyam News

రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు

Satyam News

సోమశిల జలాశయం పెన్నా నదికి నీటి విడుదల

Satyam News

Leave a Comment

error: Content is protected !!