వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న బీరంగూడకు చెందిన అలవాటుపడిన నేరస్తులయిన తూర్పాటి సాయి కుమార్ వయస్సు(21), మన్నే సాయి కిరణ్ (19) లను చందానగర్ పోలీసు లు అరెస్టు చేశారు. స్టేషన్ నేర పరిశోధన సిబ్బంది నిఘా మరియు సిసి కెమెరాలు ఇతర ఆధారాల ద్వారా గుర్తించి వారిని పట్టుకొని తమదైన శైలిలో విచారించారు.
నేరస్తులు తాను చేసిన నేరాలను అనగా చందానగర్, మియాపూర్, కూకట్ పల్లి, KPHB కాలనీ, గచ్చిబౌలి,సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు మోటార్ సైకిళ్ళు దొంగిలించినట్లు అంగీకరించారు. చందానగర్ పోలీస్ వారు తేదీ 10.09.2025 నాడు 12 గంటల సమయంలో పాపిరెడ్డి కాలనీలో వారిని పట్టుకోగా అట్టి ఇద్దరు నేరస్తులు 14 మోటార్ సైకిళ్ళు, రాత్రి దొంగతనం కేసులను ఒప్పుకున్నారు.
చందానగర్ పోలీసువారు నిందితుల వద్ద నుండి ఇట్టి కేసులకు చెందిన ఒక హీరో గ్లామర్ మోటార్ సైకిళ్, ఒక షైన్ , ఒక యమాహా బైక్, ఒక Dio బైక్ ,ఒక ఆక్టివా స్కూటి, ఒక NS-160 బైక్,ఒక డీలక్స్ బైక్, రెండు ఫాషన్ ప్రొ బైకులు,రెండు ఫాషన్ ప్లస్ బైకులు,మూడు స్ప్లెండర్ బైకులు స్వాధీనపరుచుకున్నారు.
ఇందులో చందానగర్ పి.యస్ కు సంబందించిన 6 బైక్స్ (కేసులు) కలవు. వీరిని తేదీ 11.09.2025 నాడు చందానగర్ పోలీసువారు అరెస్టు చేసి రిమాండు కు తరలించినారు. ఇట్టి కేసులలో చందానగర్ డిటెక్టివ్ సిబ్బంది పాపి రెడ్డి కాలనీలో నిఘా పెట్టి ఇట్టి నేరస్తులను తేదీ 10.09.2025 నాడు పట్టుకోవడం జరిగింది.
DI భాస్కర్ పర్యవేక్షణలో SI, నర్సింహారెడ్డి, హెడ్ కానిస్టేబుళ్ళు శ్రీనివాస్ రెడ్డి, సాదిక్ అలీ, కానిస్టేబుళ్ళు బుచ్చి రెడ్డి, ప్రభాకర్, విట్టలయ్యలు విశేషంగా కృషి చేసి బైక్ దొంగలను పట్టుకున్నారు. చందానగర్ నేర పరిశోదన సిబ్బందిని మియాపూర్ డివిజన్ ఏసిపి శ్రీనివాస్ కుమార్ అభినందించినారు.