సంపాదకీయం హోమ్

సుభాష్ నేరాన్ని సమర్థించే వారు ఇది తెలుసుకోవాలి….

#Amaravati

రాజకీయ కారణాలతో రాజకీయ ప్రత్యర్థులపై బురదచల్లడాన్ని కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీపై ప్రతిపక్షం విమర్శలు చేయడం కూడా ఓకే. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ విమర్శలు చేయవచ్చా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

అదీ కూడా తనకు అన్యాయం జరిగితేనో, తన సాటి వారికి అన్యాయం జరిగితేనో ఆ ప్రభుత్వ ఉద్యోగి స్పందించి ప్రభుత్వాన్ని విమర్శించాడు అన్నా కూడా అతని తప్పు ఏముంది అని కూడా చాలా మంది ప్రశ్నించవచ్చు. ఒక అసత్యాన్ని, ఒక అభూతకల్పనను తప్పుడు వార్తను కేవలం రాజకీయ దురుద్దేశ్యంతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన ప్రభుత్వ ఉద్యోగిని కూడా చర్యలు తీసుకోకుండా వదిలేయాలా?

రాష్ట్ర రాజధాని అమరావతిపై గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ దారుణమైన ప్రచారాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ‘ అమరావతి మునిగిపోయింది’ అనేది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, కోల్ కతా లాంటి నగరాలు మునిగిపోయినా ఎవరూ ఏమీ మాట్లాడరు కానీ, ఎంత భారీ వర్షం వచ్చినా సురక్షితంగా ఉన్న అమరావతి ప్రాంతంపై మాత్రం నీచమైన ప్రచారాన్ని వైసీపీ చేస్తూనే ఉన్నది.

ఆ నీచమైన ప్రచారాన్ని కొనసాగిస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగి అమరావతి మునిగిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. తిరుపతిలో జీఎస్టీ విభాగంలో పని చేసే సుభాష్ చంద్రబోస్ అనే అసిస్టెంట్ కమిషనర్ అమరావతి మునిగిపోయినట్లు ఫేక్ ప్రచారం చేశాడు. అమరావతి ఎక్కడా మునిగిపోలేదు అని ప్రభుత్వం పలుమార్లు వాస్తవ పరిస్థితిని తెలిపినా వైసీపీ చేసినట్లే ఈ సుభాష్ చంద్రబోస్ కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశాడు.

ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ప్రభుత్వంపైనే బురద చల్లే విధంగా తప్పుడు ప్రచారం చేసినందుకు అతడిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అతడిని సస్పెండ్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో ‘వుయ్ స్టాండ్ విత్ సుభాష్’ అంటూ కొందరు ప్రచారం మొదలు పెట్టారు. రాజకీయ విమర్శలు చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగం మానుకుని చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ తప్పుడు ప్రచారం చేయవచ్చా?

ఈ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యను తప్పుపడుతూ భావప్రకటనా స్వేచ్ఛ లేదా అంటూ కొందరు బాధపడిపోతున్నారు. “అమరావతి ముంపుకు గురైనది లేక అమరావతి ని వరద ముంచెత్తింది” అనే ప్రచారం ఒక అసత్యం. ఈ అబద్దాన్ని సుభాష్ చంద్ర బోస్ తో సహా చాలా మంది ప్రచారం చేశారు. వీళ్ళలో అత్యధికులు వామపక్షాల నుంచి ఉన్నారు.

ఉద్యోగుల (రాజకీయ) అభిప్రాయాల గురించి రాజ్యాంగ పరిషత్తులో చాలానే చర్చ జరిగింది. చివరకు బ్రిటీష్ మోడల్ ని అనుసరించారు. అభిప్రాయం కలిగివుండటానికి, ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చెయ్యటానికి తేడా ఉంది. అంతే కాకుండా దీనివలన 30వేల రైతు కుటుంబాలు ప్రత్యక్షంగా నష్టపోతాయానే స్పృహ వైస్సార్సీపీ వాళ్ళకు లేకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు.

కానీ విప్లవకారులమని చెప్పుకునేవాళ్ళు చాలా మంది ఇలా విషయం తెలుసుకోకుండా దుష్ప్రచారం చేశారు. సుభాష్ సస్పెన్షన్ గురించి తెలంగాణా నుంచి చాల మంది సోషల్ మీడియాలో కన్నీరు కారుస్తున్నారు. వారంతా అర్ధం చేసుకోవలసింది ఏమంటే…. తెలంగాణ అంటే వారికి ఎంత ప్రియమో ఆంధ్రాలో ఉండేవారికి ఆంధ్రా అంటే అంతే ప్రేమ ఉంటుంది. జగన్ తన పాలనలో  విధ్వంసం చేసిన రాజధానిని ఎంతో కష్టపడి ప్రభుత్వం నిర్మిస్తుంటే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి.

అమరావతిలో వరదనీరు లేకపోయినా నష్టం ఏమీ జరగక పోయినా ( ఒకరిద్దరు పాత లెఫ్ట్ వ్యక్తులు అమరావతికి వెళ్లి, చూసి అక్కడ….సుబాష్ చెప్పింది లాంటివేమీ జరగలేదని చెప్పారు కూడా) అలా దొంగ వీడియోలు చేయడం తప్పు కాదా? ప్రభుత్వ ఉద్యోగి అంటూ ఇంకొకటి….ఎవరైనా సరే …తప్పు తప్పే… ప్రశ్నించడం అంటే….తమకు అన్యాయం జరిగినప్పుడు …. మాట్లాడ్డం. అమరావతి విషయంలో అతనికి జరిగిన అన్యాయం ఏమిటి?

నోటికోచ్చినట్లు ఒక రాష్ట్ర రాజధాన్ని తిడుతూ దొంగ వీడియోలు పెట్టేదాన్ని ప్రశ్నించడం అంటారా? ఐ స్టాండ్ విత్ సుబాష్ అంటే….అర్ధం ఏమిటి? ఆయన అమరావతి మీద చేసిన ఫేక్ వీడియోలను సమర్ధిస్తున్నారా? అది కరెక్ట్ అని మీ భావమా? అలా చేయచ్చా?  ఫేక్ వీడియోలు చేయడాన్ని…భావ  స్వాతంత్ర్యము కానే కాదు…!

Related posts

తిరుమలపై దండయాత్రకు వస్తున్న జగన్

Satyam News

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

Satyam News

అమరావతి కి వచ్చిన ‘బాన్‌బ్లాక్ టెక్నాలజీ’

Satyam News

Leave a Comment

error: Content is protected !!