86 సంవత్సరాల వయస్సులో మృతి చెందిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హర్భజన్ సింగ్ మరణంపై లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
హర్భజన్ సింగ్ ని నేను వ్యక్తిగతంగా కలిసే అవకాశం లేకపోయినా, ఆయన జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో చేసిన సేవల గురించి విన్నాను. భారతదేశానికి దూరంగా ఉన్నప్పటికీ, ఆయన మా సిద్ధాంతాలను నిలబెట్టారు. ప్రవాస భారతీయులను తన చురుకైన కార్యకలాపాలతో ప్రేరేపించారు. ఆయన మరణం ఒక పెద్ద నష్టం. నేను ఈ విషయాన్ని రాహుల్ గాంధీ కి తెలియజేస్తాను. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి నిబద్ధత కలిగిన కాంగ్రెస్ అనుబంధ సంస్థలు, వ్యక్తుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిలబడి ఉంటుందని మరలా ధృవీకరిస్తున్నాను.” అని వారు పేర్కొన్నారు.
స్వనితి ఇనిషియేటివ్ ఆహ్వానంపై,చామల కిరణ్ కుమార్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో జరిగే క్లైమేట్ వీక్ NYC లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్వనితి ఇనిషియేటివ్ వర్క్‌షాపులు, నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు, ప్రపంచ నాయకులతో ప్యానెల్ చర్చలను నిర్వహిస్తోంది.
భారతదేశం తరుపున వాతావరణ విధానంపై ప్రభావం చూపగల నాయకుడిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ని ఇతర ఎంపీలతో కలిసి గుర్తించడం గౌరవకరమైన విషయం.