సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నివాసం ఉన్న తిలక్ నగర్ అరుంధతి నగర్ లో మొదటి రోజు పాదయాత్ర నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు నివాసమున్న ప్రాంతం చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉందని ఈ సమస్యలను కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిష్కరించాలని మున్సిపల్ యూనియన్ నగర గౌరవాధ్యక్షుడు చంద్ర రెడ్డి కోరారు.
మున్సిపల్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కంచుపాటి తిరుపాల్ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచుపాటి శ్రీరాములు నగర సహాయ కార్యదర్శి ఇత్తడి ప్రకాష్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తిలక్ నగర్ గాంధీ రోడ్ 2020 రెండు గంగమ్మ గుడి బ్యాక్ సైడ్ ఉన్నట్టు వర్షపు నీరు పోవాలని చిన్నపాటి కాలువగా ఉన్న డ్రైనేజ్ ని వంక లాగా పెద్ద కాలవని తవ్వి దానికి కావాల్సినంత సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు.
ఇరువైపులా తగినంత కాలువగా కట్టినట్లయితే ఆ కుటుంబాలు నివాసం ఉండడానికి ఉపయోగపడతాయని కోరారు. అలాగే చాలామంది మున్సిపల్ కార్మికులకు కార్పొరేషన్ నుండి హౌసింగ్ లోన్స్ ఇప్పించాలని కోరారు. కొద్దిపాటి వర్షం కురిస్తే ఆ ప్రాంతంలో సిసి రోడ్లు లేక మోకాళ్ళు లోతు వర్షం నీరు రోజులు తరబడి నిలుస్తాయి. అదే అర్ధరాత్రి కురిసిన వర్షం పడితే తెల్లవారుజాము న 4:30 కి మాస్టర్ కి వస్తున్న మున్సిపల్ కార్మికుల అవస్థలు అంతా ఇంతా కాదు.
తీవ్రమైన బురద నీరు తెల్లగా తెల్లవారినాక చూసుకొని డ్యూటీ కి లేటుగా వస్తే సెక్రటరీ ఆబ్సెంటేసి ఇండ్లకు పంపించడం జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే లైట్లే లేవు. కరెంటు స్తంభం ఉంటే నైట్ ఉండదు లైట్ ఉంటే కరెంట్ ఉండదు. ఇక ఎక్కడ కూడా డ్రైనేజీ కాలువలు లేవు. నేటికీ 27 సంవత్సరాలు అయిపోయినా కూడా తిలక్ నగర్ చాలా అంటే చాలా దుర్భర పరిస్థితిలో ఉందంటే పాలకుల నిర్లక్ష్యమే అని అన్నారు.
ఈ పాదయాత్రలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు మహిళా కమిటీ సభ్యురాలు ఆరోగ్యమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు కంచుపాటి తిరుపాల్ నగర సహాయ కార్యదర్శి ఇత్తడి ప్రకాష్ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచుపాటి శ్రీరాములు, నగర కమిటీ సభ్యులు నాగరాజ్, మహేంద్ర, రాముడు, పాలేటి చిన్నగంగయ్య,రోడ్డ శివకుమార్, హరి కృష్ణ, రాజు కార్మికులు పాల్గొన్నారు.