విజయవాడలో ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశం ఏసీఏ నూతన కమిటీని ఎన్నుకున్నది. అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని (శివనాథ్) ఎన్నిక కాగా కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్ ఎన్నిక అయ్యారు. ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఏసీఏ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మరో 34 మందితో ACA నూతన కమిటీ ఎన్నికలు పూర్తయ్యాయి. మూడేళ్ల కాల పరిమితితో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయడానికి నూతన కమిటీ సిద్ధమౌతున్నది. ఈ సందర్భంగా భవిష్యత్తులో చేపట్టనున్న పనులు స్టేడియాల నిర్మాణం టోర్నమెంట్ల నిర్వహణపై సమీక్ష జరిపారు.
next post