పాలమూరు పట్టణంలోని శ్రీ కాటన్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా కమనీయంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను చక్కటి వేదికపై కొలువు తీర్చిన అర్చకులు, శాస్త్రక్తంగా వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ పూజారులచే లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితు లు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు స్వామి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.
previous post
next post