కాళేశ్వరంపై సీబీఐ చే విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తెలిపారు. తెలంగాణలో ఉన్న జలాలను ఎలా వాడుకోవాలో తెలిసిన వ్యక్తి కెసిఆర్. అలాంటి వ్యక్తిపై అవినీతి ఆరోపణలు చేయడం విచారకరమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు రాకుండా ఆపేసి ఉద్దేశపూర్వకంగానే అవినీతిని అంటగడుతున్నారని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపులు 80 నుంచి 90 వేల కోట్లు అయితే లక్షల కోట్లు అవినీతి ఎట్లా జరుగుతుందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
అలాగే రెండు పిల్లర్లు కూలితే మొత్తం ప్రాజెక్టు కూలినట్టా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అని ఆయన అన్నారు. సాంకేతిక లోపం ఉంటే వాటిని సరిచేసి దాన్ని వాడుకలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, కానీ మరమ్మత్తులు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేసింది అంటేనే దీని వెనకాల ఏదో కుట్ర ఉందని అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.
సిబిఐ ఎంక్వయిరీ చేసిన దీనిలో తేలేది ఏమీ లేదని ఆయన అన్నారు. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ కు, కేసిఆర్ ఆలోచన విధానానికి ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయడంలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నది ఆయన వివర్శించారు. ప్రజలందరూ కూడా ఈ నిర్ణయం మీద తిరగబడాల్సిన అవసరం ఉందని క్రాంతి కిరణ్ అన్నారు.