ఎమ్మెల్సీ పోతుల సునీత దంపతులు నేడు బీజేపీలో చేరనున్నారు. విశాఖలో జేపీ నడ్డా సమక్షంలో సునీత దంపతులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా ఉన్నా ఇటీవల ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి సునీత రాజీనామా చేశారు. తెలుగుదేశంలో ఈమె చేరికపై బాహాటంగా వ్యతిరేకత ఏర్పడింది.
సొంత పులివెందులలో.. డిపాజిట్ కోల్పోవడం నుండి వైకాపా మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. షర్మిల తన అబ్బాయి రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు అని ప్రకటించగానే వైకాపా కార్యకర్తలు కూడా మానసికంగా ఈ పరిణామాలకు సిద్ధం అవుతున్నారు. బొత్సా లాంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ వైపు చూస్తుండడంతో.. మిగిలిన నాయకులు కూడా.. తమ రాజకీయ భవిష్యత్తుపై ఆశలు కోల్పోకుండా.. కూటమి కేసి చూస్తున్నారు.
జగన్ బెయిలు రద్దయినా.. దేశంలో అతి పెద్దదైన లిక్కర్ స్కాములో అరెస్ట్ అయినా.. ఆరోజు వైకాపా వెంటిలేటర్ ట్యూబ్ పీకేస్తారు అని, జాగ్రత్తపడుతున్నారు అంతా. కూటమి నుండి స్పందన రాకపోతే.. కాంగ్రెస్స్ అయినా పర్లేదు అనే సమాలోచనలు చేస్తున్నారు.