ముఖ్యంశాలు హోమ్

స్కూల్లో నే డ్రగ్స్ తయారీ

హైదరాబాద్ పాతబోయిన్‌పల్లిలో ఓ ప్రైవేటు పాఠశాల తరగతి గదుల్లో మత్తు పదార్థాల తయారీ కేంద్రం బయటపడటం సంచలనంగా మారింది. స్కూల్ లో చట్టవిరుద్ధంగా అల్ప్రాజోలం అనే మత్తుమందును తయారు చేస్తుండటం దిగ్భ్రాంతికి గురిచేసింది.

మేధా ప్రైవేట్ పాఠశాల రెండో అంతస్తులో అక్రమంగా మత్తు పదార్థాల తయారీ జరుగుతోందన్న సమాచారంతో ఈగల్ బృందం పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి, రహస్యంగా కొనసాగుతున్న ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు.

పాఠశాల నిర్వాహకుడైన జయప్రకాశ్ గౌడ్ రెండు గదుల్లో అల్ప్రాజోలం తయారీ యంత్రాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రసాయన దుకాణాల నుంచి ముడి సరుకులు తెచ్చి, 6-7 దశల్లో ప్రాసెస్ చేసి మత్తు మందు తయారు చేస్తున్నట్టు విచారణలో తేలింది.

ఉదయం పాఠశాల తరగతులు జరుగుతుండగానే, అదే సమయంలో పై అంతస్తులో ఈ దందా సాగుతోంది. స్థానికులకు ఎటువంటి అనుమానం రాకుండా పాఠశాలను అడ్డుగా ఉపయోగించుకున్నాడు.

సోదాల అనంతరం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ. 20 లక్షల నగదు, దాదాపు రూ. కోటి విలువైన 7 కిలోల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్న ఈగల్ బృందం.. నిందితులు అల్ప్రాజోలంతో పాటు మరిన్ని మత్తు పదార్థాల తయారీలో కూడా భాగమై ఉండవచ్చన్న అనుమానంతో దర్యాప్తు కొనసాగిస్తోంది.

Related posts

ఆయుర్వేదానికి ఆదరణ పెరగాలి

Satyam News

రెగ్యులర్ షూటింగ్ లో భీమవరం టాకీస్ “మహానాగ”

Satyam News

24 గంటల్లో చైన్ స్నాచింగ్ కేసు పరిష్కారం

Satyam News

Leave a Comment

error: Content is protected !!