ఎర్రచందనం చెట్లు నరికేందుకు , అక్రమ రవాణా కు రెండు వాహనాల్లో వెళ్తున్న దాదాపు 17 మంది తమిళనాడుకు చెందిన కూలీలను కడప ఎర్రచందనం స్పెషల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలతో పాటు , తమిళనాడు కూలీలను కడపకు తరలించినట్లు సమాచారం.
బెంగళూరు నుంచి మైదుకూరు అటవీ ప్రాంతానికి ఎర్రచందనం దుంగలు నరికేందుకు కూలీలను తీసుకొస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రెండు వాహనాలను వెంబడించారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని పెద్ద శెట్టి పల్లె సమీపంలో తమిళనాడు కూలీలు వెళ్తున్న వాహనాలను ఎర్ర చందనం స్పెషల్ ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు.