దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఏలూరు జిల్లా కోర్టులో ఊరట లభించింది. 2011లో నమోదైన కేసులో చింతమనేనిని నిర్దోషిగా కోర్టు తేల్చింది. రచ్చబండ కార్యక్రమంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు వట్టి వసంతకుమార్ కు చింతమనేని మధ్య ఘర్షణ జరిగింది.
ఈ కేసులో చింతమనేనికి భీమడోలు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. భీమడోలు కోర్టు తీర్పును జిల్లా కోర్టులో చింతమనేని సవాల్ చేశారు. ఏలూరు జిల్లా కోర్టులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఊరటనిచ్చింది. సదరు కేసు కొట్టివేసింది.