ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. తుళ్లూరులో E7 రోడ్డును ఆనుకుని హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా హాస్పిటల్ శంకుస్థాపన, పూజా కార్యక్రమాల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. 21 ఎకరాల్లో 500 బెడ్ల కెపాసిటీ తో రూ.750 కోట్లతో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం జరగబోతున్నది.
previous post
next post