నేటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ చేయాలని ఫిలిం ఫెడరేషన్ ప్రకటింది. ఫిలిం ఫెడరేషన్‌కు వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేయాలని నిర్ణయించారు. దీంతో నేటి నుంచి ఎక్కడిక్కక్కడ సినిమా షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. వేతన వివాదంపై నిరసనగా ఆగస్టు 9వ తేదీ నుంచి బంద్ ప్రారంభమైంది. సినిమా 23 శాఖలకు చెందిన కార్మికులందరూ విధంగా బందులో పాల్గొంటున్నారు. షూటింగ్స్ ఆపి అన్ని షూటింగ్స్ కు నిర్మాణ సంస్థలు బ్రేక్ ప్రకటించాయి. ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం కౌన్సిల్ సమావేశం విఫలమైంది. నిర్మాతల మండలి వేతనాల పెంపు విషయంలో అటు ఇటు కాకుండా వ్యవహరిస్తుండటంతో ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాంతో, ఇప్పటికే షూటింగ్ లను ప్రకటించిన నిర్మాతలు కూడా షూటింగ్ లను ఆపేశారు. ఈ నేపథ్యంలో, షూటింగ్ లు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయన్నది ప్రస్తుతం ఆసక్తికరమైన అంశంగా మారింది.
previous post