ఏపీలో పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు వచ్చే నెల మొదటి వారంలో పంచాయతీలకు విడుదలవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. ‘ఆర్దిక సంఘం నిధుల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులకు ఉపశమనం కలగనుంది. హామీ ఇచ్చినట్లు గానే ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల్లో సద్వినియోగం చేయాలన్న దృఢమైన వైఖరిని ప్రభుత్వం తీసుకుంది. స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేస్తూ గ్రామ స్థాయిలో కనీస మౌలిక వసతులు, సేవలు సమర్థంగా అందించాలన్నదే మా ఉద్దేశం. రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిధులు సకాలంలో విడుదల చేసినందుకు ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.