సంపాదకీయం హోమ్

ఏపీ లో ఇలా జరుగుతున్నది ఏమిటి?

GST వసూళ్లలో ఏపీ దూసుకుపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GST వసూళ్లు అంచనాలకు మించి వస్తున్నాయి. 2025-26 ఏడాది మొత్తానికి రూ.27,477.15 కోట్లు జీఎస్టీ రూపంలో వస్తుందని రాష్ట్ర బడ్జెట్‌ అంచనా వేసింది. అలాంటిది తొలి 4 నెలల్లోనే అందులో 61% వసూళ్లు వచ్చాయి.

ఏప్రిల్, మే, జూన్, జులై నెలల్లోనే రూ.16,754 కోట్ల జీఎస్టీ రాబడి వచ్చింది. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) 4 నెలల నివేదికను తాజాగా విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ.2,17,976.53 కోట్ల రెవెన్యూ వసూళ్లు అంచనా వేయగా 4 నెలల్లో రూ.49,052 కోట్లు వచ్చాయి. అప్పులతో కూడా కలిపి మొత్తం నాలుగు నెలల్లో ఖజానాకు వచ్చినది సుమారు రూ.లక్ష కోట్లకు చేరింది.

రాష్ట్రంలో రెవెన్యూ లోటు తొలి 4 నెలల్లోనే 110 శాతానికి చేరింది. రెవెన్యూ వసూళ్లు రూ.49,052.98 కోట్లు ఉండగా రెవెన్యూ ఖర్చు రూ.85,793.99 కోట్లుగా ఉంది. దీంతో రెవెన్యూ లోటు నాలుగు నెలలకు రూ.36,741.01 కోట్లుగా తేలింది. బడ్జెట్‌ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటును రూ.33,185.97 కోట్లుగా పేర్కొన్నారు. గడిచిన నాలుగు నెలల్లో రూ.49,198 కోట్ల మేర ప్రభుత్వం అప్పులు చేసింది.మూలధన వ్యయం కింద రూ.8,579.86 కోట్లు ఖర్చుచేశారు. 4 నెలల్లో అప్పులపై వడ్డీలు, అప్పుల అసలు చెల్లింపు రూపంలోనే రూ.20వేల కోట్లు ఖర్చుచేయాల్సి వచ్చింది.

చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది.. జగన్‌ హయాంలో రియల్ ఎస్టేట్‌ పడక వేసింది.. రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా తగ్గింది.. బాబు పవర్‌లోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధానిపై తీసుకున్న నిర్ణయంతో అక్కడి నిర్మాణ రంగం, రియల్‌ ఎస్టేట్‌లో వృద్ధి కనిపిస్తోంది.. ఇటు, విశాఖతోపాటు ఉత్తరాంధ్రకి ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి.. దీంతో, ఆ ప్రాంతంలోనూ మార్కెట్‌ పెరుగుదలలో గ్రోత్‌ ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇటు రాయలసీమకు పదుల సంఖ్యలో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎమ్‌వోలు చేసుకొని ఫ్యాక్టరీలు నెలకొల్పాయి.. ఈ ప్రభావంతో సీమ ప్రాంతంలోనూ రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు పెరుగుతున్నాయి…

వీటి అన్నింటితో గత నెలలో ఏకంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం 39 శాతం వృద్ధి నమోదు చేసింది.. అంటే, ఏపీలో గ్రోత్‌ రేట్‌ ఏ దిశలో దూసుకుపోతోందో అర్ధం చేసుకోవచ్చు.. మరోవైపు, దేశవ్యాప్తంగా మెట్రో నగరాలలో రియల్ ఎస్టేట్‌ ట్రాన్సాక్షన్లు పడిపోతున్న తరుణంలో ఏపీలో పాజిటివ్‌ ట్రెండ్ నమోదు కావడం విశేషం.. ఇది రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకంగా భావిస్తున్నారు ఎకనామిస్టులు… ఈ ఏడాది ఎండింగ్‌లో ఏపీ గ్రోత్‌ ఇంజిన్‌లు గేర్‌ మార్చి మరింత దూకుడుగా పరుగులు పెట్టడం ఖాయం అని అంచనా వేస్తున్నారు ఎనలిస్టులు..

Related posts

కరివేపాకే కదా అని ఈజీగా తీసి పారేయద్దు

Satyam News

నేపాల్ వ్యాప్తంగా నిషేధాజ్ఞలు: రంగంలో సైన్యం

Satyam News

వాట్సప్ గవర్నెన్సు ద్వారా ఏపీలో 751 పౌరసేవలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!