బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 65 లక్షల మంది పేర్లను ఎన్నికల సంఘం (EC) ప్రకటించింది. తొలగించిన పేర్ల వివరాలను ఆగస్టు 19 లోగా ప్రజలకు అందుబాటులో ఉంచి, ఆగస్టు 22 నాటికి దీనికి సంబంధించిన నివేదికను సమర్పించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ చర్య చోటు చేసుకుంది. ఎన్నికల సంఘం పోలింగ్ బూత్‌ల వారీగా ‘ASD’ (Absentee, Shifted, Dead) గైర్హాజరు, మారిన వారు, మరణించిన వారు) ఓటర్ల పేర్లను ప్రకటిస్తోంది. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వాటిని ఆన్‌లైన్‌లో కూడా ఉంచే అవకాశముందని వారు తెలిపారు. బీహార్ ముఖ్య ఎన్నికల అధికారి (CEO) తెలిపిన వివరాల ప్రకారం, రోహ్తాస్, బేగుసరాయ్, అరవల్ మరియు ఇతర ప్రదేశాలలో పోలింగ్ బూత్‌ల వద్ద ASD జాబితాలు ప్రదర్శించబడ్డాయి.
previous post
next post