నారా లోకేష్..సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అన్నా అని చిన్న ట్వీట్ వేస్తే చాలు..నేనున్నానంటూ భరోసానిస్తారు. వెంటనే తన టీమ్‌ను అలర్ట్ చేసి కష్టాల్లో ఉన్న వారికి సాయం అందేలా చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతో మంది లోకేష్ నుంచి సాయం పొందారు. పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఇలా ఎవరు ట్వీట్ చేసినా లోకేష్ స్పందిస్తున్నారు.
తాజాగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సైతం లోకేష్ నుంచి సాయం పొందిన వారి జాబితాలో చేరిపోయారు. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ఎంత దారుణంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రోల్స్, ప్రత్యర్థి పార్టీలపై బూతులు ఆ పార్టీ సోషల్‌మీడియా ప్రత్యేకత. ప్రత్యర్థి పార్టీలపై దాడి చేసేందుకు వైసీపీ అనేక ఫేక్ అకౌంట్లు కూడా క్రియేట్ చేసింది.
అందులో రకిటా అనే అకౌంట్ ఒకటి. ఐతే తాజాగా ఈ అకౌంట్ నుంచి కూడా సాయం కోరుతూ నారా లోకేష్‌కు రిక్వెస్ట్ వెళ్లింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ సోషల్ మీడియా కార్యకర్త బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని.. ఆస్పత్రిలో చేర్పించమని చెప్పారు. వైసీపీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదు.
దీంతో నారా లోకేష్‌తో పాటు మరికొందరిని అభ్యర్థిస్తూ రకిటా అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి రిక్వెస్ట్ వెళ్లింది. ఐతే ట్వీట్ చూసిన వెంటనే నారా లోకేష్ స్పందించారు. మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యర్థి పార్టీ కార్యకర్త ఐనప్పటికీ..లోకేష్ వెనకా ముందు ఆలోచించలేదు. మనిషి ప్రాణం గురించి ఆలోచించారు. వైసీపీ కార్యకర్తలు సైతం నారా లోకేష్ సాయం కోసం ముందుకు వస్తున్నారంటే ఆయన దృష్టికి వెళ్తే కచ్చితంగా హెల్ప్ చేస్తారన్న నమ్మకమే. ఇలాంటి ఇమేజ్ సాధించడం అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యం.