ప్రశాంతంగా ఉండే ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు బయటపడటంతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ధర్మవరంలోని ఒక హోటల్లో వంట మనిషి గా పనిచేస్తున్న నూర్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నూర్ కోట ఏరియాలో నివాసం ఉంటున్నారు. నూర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నది. నూర్ అనే వ్యక్తికి ఇస్లామిక్ గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని డీఎస్పీ నరసింగప్ప తెలిపారు.
పాకిస్థాన్ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను సభ్యుడుగా ఉన్నాడని సమాచారం. నూర్ ఏయే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న విషయం విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న నూర్ ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.