ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జవహర్ నగర్ కాలనీకి చెందిన గోపిరెడ్డి కాశిరెడ్డి (65) ని ఈనెల 9వ తేదీన ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఢీకొట్టారు. ఇదేమిటి అని ప్రశ్నించిన కాశిరెడ్డిని ఇద్దరూ యువకులు ఇష్టానుసారంగా కొట్టి గాయపరిచారు.
తీవ్రంగా గాయపడ్డ కాశిరెడ్డిని గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించగా చికిత్స పొందుతూ కాశిరెడ్డి మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.