ప్రకాశం హోమ్

భార్యపై భర్త అమానుష దాడి

తర్లపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామం ఎస్టి కాలనీ చెందిన గురునాథం భాగ్యలక్ష్మి అనే మహిళపై భర్త బాలాజీ దాడి చేసిన ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు తక్షణం స్పందించారు. సమాచారం అందుకున్న వెంటనే దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, పొదిలి సిఐ వెంకటేశ్వర్లు, తర్లుపాడు పాడు ఎస్సై బ్రహ్మనాయుడు సంఘటన ప్రదేశానికి వెళ్లి బాధితురాలను పరామర్శించి ఆ మహిళను హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

సుమారు 12 సంవత్సరాల క్రితం వారికి వివాహం అయింది. వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు. గురునాథం భాగ్యలక్ష్మి కలుజువ్వలపాడు గ్రామములోని బేకరీ నందు పనిచేస్తున్నట్లు, గురునాథం భాగ్యలక్ష్మి భర్త బాలాజీకి మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తెలిసింది. గురునాథం భాగ్యలక్ష్మిని అనుమానిస్తున్నట్లు ఫిర్యాదు ఉంది. ఈ నెల 13న రాత్రి షుమారు 09:30 సమయంలో గురునాథం భాగ్యలక్ష్మి కలుజువ్వలపాడు గ్రామము లోని బేకరీలో పని ముగించుకొని ఇంటికి వెళుతుండగా, మార్గ మధ్యలో గురునాథం భాగ్యలక్ష్మి భర్త బాలాజీ అతని కుటుంబ సభ్యులు కలిసి ఆమెను ఇంటికి తీసుకువెళ్లి చేతులు కట్టేసి బెల్ట్ తో వీపు పై కొట్టి, కాళ్ళతో, చేతులతో కొట్టారు. ఈ ఫిర్యాదు పై ప్రకాశం జిల్లా పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. మహిళలు/ పిల్లలపై దాడులు జరిగితే సహించేది లేదని జిల్లా ఎస్పీ అన్నారు.

Related posts

పవన్ కల్యాణ్ తో బాలకృష్ణ కామెంట్ పై చంద్రబాబు చర్చ?

Satyam News

ట్రంప్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ

Satyam News

తమ్ముడు అకౌంట్‌ నుండి జగన్‌కి…. పీఏ పట్టించేశాడు…!!

Satyam News

Leave a Comment

error: Content is protected !!