మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఇష్టుడైన ఒక అధికారిని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలగించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి పవిత్రతను దెబ్బతీశారని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే యాదాద్రి పేరును మార్చి యాదగిరిగుట్టగా చేసేశారు.
కేసీఆర్ హయాంలో యాదగిరి గుట్ట స్పెషల్ ఆఫీసర్ గా నియమితుడై అప్పటి నుంచి కొనసాగుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కిషన్ రావును నేడు తొలగించారు. తెలంగాణ దేవదాయ శాఖ డైరెక్టర్ గా పదవీ విరమణ పొందిన IAS అధికారి ఎస్. వెంకటరావును యాదగిరి గుట్ట EO గా నియమించారు.
శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు కేటాయించారు. ఇప్పటి వరకు ఈ రెండు బాధ్యతలను సీనియర్ రిటైర్డ్ IAS కిషన్ రావు నిర్వహించారు. ఆయన్ని తొలగించి వెంకటరావును నియమించారు.