అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నూతగుంటపాలెం రెలియన్స్ బంకు వద్ద 16 వ జాతీయ రహదారి పక్కన ప్రయివేట్ బస్సు తిరగబడ్డది. ఒరిస్సా లోని అడ్డుబంగి నుండి హైదరాబాద్ కు బస్సు వెళ్తున్నది. ప్రమాద సమయంలో పిల్లలతో సహా ఉన్న 35 మంది ప్రయాణికులు ఆ బస్సులో ఉన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు తగిలాయి. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. వర్షం కారణంగా స్కిడ్ అయ్యి, స్టీరింగ్ లాక్ అవడంతో ప్రమాదం జరిగింది అని డ్రయివర్ చెబుతున్నాడు. హైటెన్షన్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పక్కన బస్సు పడటంతో పెను ప్రమాదం తప్పింది.
previous post