చిత్తూరు హోమ్

డొల్ల కంపెనీల పుట్ట.. చెవిరెడ్డి బుట్ట

#ChevireddyBhaskarReddy

తుమ్మలగుంటలో తలుపు తట్టిన సిట్. చిరునామా ఉంది, కంపెనీ లేదు. కానీ తలుపు తెరిచినవాడు “డైరెక్టర్” కాదు.. డ్రైవర్! పక్కింటి మామ, పీఏ, మరదలు, మేనల్లుడు, పొరుగింటి శోభారాణి.. వీరే ఆయన “కార్పొరేట్ బోర్డు”. “మద్యం కుంభకోణం”లో ఈయన పాత్ర గురించి దర్యాప్తు సంస్థలకి అందిన సమాచారంతో ఒక్కొక్కటిగా బయటపడ్డాయి

ఈ నేరపు డొల్ల కంపెనీల పుట్టలు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి క్రియేటివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. డొల్ల కంపెనీలకి పేరు పెట్టడానికి, కష్టపడి కొత్త కొత్త పేర్లు ఆలోచించలేదు. బహుశా, ఆ తల నొప్పి ఎందుకనుకున్నాడో ఏమో, సులువుగా పక్కనున్న వాళ్ళ పేర్లనే కంపెనీలకి పెట్టేసుకున్నాడు.

తన బినామీలను డైరెక్టర్లుగా పెట్టిన ఈయన, కంపెనీలకు కూడా వారి సొంత పేర్లనే పెట్టి అసలు ఓనరైన తనకు ఏ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. నిజంగా ఈయన సెట్టింగుల అతి తెలివితేటలు చూస్తే నవ్వొస్తోంది. అస్సలు ఊహించనట్లున్నాడు ఓడిపోతున్నాం అని గానీ, ఇలా అడ్డంగా దొరికిపోతామని గానీ. మొత్తానికి ఈయన “బినామీ బంధుత్వ ప్రైవేట్ లిమిటెడ్” అనే కొత్త కాన్సెప్ట్‌ని సృష్టించేశాడు.

స్థాపించిన 8 డొల్ల కంపెనీల పేర్లు, వాటి డైరెక్టర్ల పేర్లు, ఆ డైరెక్టర్లతో ఈయనకు ఉన్న బంధాలు చూస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది: చెవిరెడ్డికి సన్నిహితుడైన కె.బీవన్ రెడ్డి మరియు అతని తల్లి కె. నాగేశ్వరి పేరు మీద బీవన్ సర్వీసెస్ రిజిస్టర్ చేశాడు.

తన మేనల్లుడు కుర్రా మునిశంకర్ రెడ్డి, మరియు తన మామ ఎ. జశ్వంత్ పేరు మీద కుర్రా డెయిరీ సర్వీసెస్ పెట్టాడు. తన అనుచరులైన బూడపాటి వినయ్ కుమార్ మరియు బి. హేమంత్ పేర్లతో వినయ్ ఇన్ఫ్రా కంపెనీ రిజిస్టర్ చేశాడు. తన డ్రైవర్ అయిన మునె హరీష్ కుమార్, అనుచరుడు గుండ్లూరు మహేశ్వర్రెడ్డి పేర్ల మీద హరీష్ సర్వీసెస్ అని పేరు పెట్టాడు.

తమ్ముడు చెవిరెడ్డి జితేంద్ర, ఆయన తల్లి చెవిరెడ్డి కుమారి పేర్లతో జితేంద్ర ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు చేశాడు. ఈయన పొరుగింటి వ్యక్తి జె. లోకేశ్ రెడ్డి మరియు ఆయన భార్య జె. శోభారాణి పేర్లను వాడుకుని శోభ డెవలపర్స్ పెట్టాడు. తన బంధువు బీకే లత మరియు మరదలు చెవిరెడ్డి సునంద పేర్లతో లత ఆగ్రో సర్వీసెస్ కంపెనీ స్థాపించాడు.

పీఏ మరియు మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన ఈ. నవీన్ కృష్ణ పేరు మీద నవీన్ ఇన్ఫ్రా కంపెనీని పెట్టించాడు. ఈ డొల్ల కంపెనీలని రిజిస్టర్ చేయడానికి ఏకంగా సొంత ఊరైన తుమ్మలగుంటలోని డోర్ నెంబర్లని ఉపయోగించారు. చివరికి సిట్ అధికారులు ఆ డోరు నెంబర్ల దగ్గరికి వెళ్తే, అక్కడ కనీసం ఆ కంపెనీల ఉనికే లేదని తేలింది.

ఇవన్నీ కేవలం కాగితాలపై మాత్రమే ఉన్నాయి. డొల్ల కంపెనీల ఆఫీస్ డోర్లకి తాళాలు వేసి ఉన్నాయి. ఒక్కరోజులో 8 కంపెనీలు, 16 బినామీలతో రిజిష్టర్ చేశాడు. అందరూ స్విచ్చాఫ్, అందరూ పరార్! బహుశా ఎక్కడో చెవిరెడ్డే దాచాడు అని జనం అనుకుంటున్నారు.

మద్యం వ్యాపారంలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి ఈ డొల్ల కంపెనీలనే వేదికగా వాడుకున్నారని దర్యాప్తులో తేలింది. చివరకు తిరుచానూరు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడి భార్య భూమిని కూడా వదల్లేదు. సుమారు ₹35-36 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం ₹2.93 కోట్లకే కొట్టేసి, ఆ మిగిలిన సొమ్ముని తన బినామీల పేరు మీద దొంగ అప్పుల రూపంలో మార్చుకున్నారని సిట్ అధికారులు తేల్చి చెప్పారు.

పకడ్బందీగా మొత్తం లావాదేవీలన్నీ ఒకే రోజు పూర్తి చేసి మాయమాటలతో, మాయ లెక్కలతో మభ్యపెట్టాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక డొల్ల కంపెనీ డైరెక్టర్ అయిన తన పీఏ కూడా అరెస్టయి గుంటూరు జైల్లో ఉన్నాడు. చెవిరెడ్డి మాత్రం సెల్ఫ్ సర్వీసు లెక్కన సెల్ఫ్ క్లీనింగ్ కోసం కోర్టు ఆవరణనే వేదికగా మార్చుకొన్నాడు.

తన తప్పు ఏమీ లేనట్లు, ఒక అమాయకుడిలా అనుచరులతో కోర్టు వద్ద కరపత్రాలు పంచిపెట్టడం, జడ్జీల ముందు ఏడుస్తూ, దేవుడున్నాడని, ప్రకృతి గొప్పదని, ఎవర్నీ వదలదని, సిట్ ఆఫీసు ముందు కాపరం పెట్టి అంతు చూస్తా అని, జైల్లో గోడలను తంతూ.. మూతిగాలిన పిల్లి లెక్కన రకరకాలుగా డ్రామాలు వేస్తున్నాడు.

ఆ కరపత్రంలో “ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నాను” అంటూ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఆ విషయం తెలిసిన జనం, ఇన్నాళ్లకు భగవంతుడు నిన్ను చూశాడు, ఈ సారి నీ పాపం పండింది, అందుకే ఈ సారి ప్రకృతి కూడా నీ బుర్రలోని డొల్లతనాన్ని పగలగొట్టింది అని చంద్రగిరిలో చక్కిలి గింతలు పెట్టినట్లు నవ్వుకొంటున్నారు.

Related posts

నారా లోకేష్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అరుదైన ప్రశంస!

Satyam News

అమరావతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు

Satyam News

ఓపెన్‌ఏఐ భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు

Satyam News

Leave a Comment

error: Content is protected !!