హైదరాబాద్‌లో దసరా పండుగ ఘనంగా జరుపుకున్నారు. సనత్ నగర్ హనుమాన్ ఆలయం, అమీర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ తలసాని మాట్లాడుతూ “దసరా పండుగ చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక. సమాజంలో సత్యం, ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయి” అని అన్నారు. రావణ దహనాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై సంబరాల్లో భాగమయ్యారు.
previous post