ముఖ్యంశాలు హోమ్

తిరుమల ముంతాజ్ హోటల్ భూమి పై వాస్తవాలు ఇవి

#Tirumala

గత ప్రభుత్వ హయాంలో 2021 నవంబర్ 24వ తేదిన స్వామి పాదాల చెంతన అలిపిరి లో వున్న పవిత్రమైన ఆ భూమిలో టూరిజం శాఖ 20 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్ హోటల్ కు కేటాయించింది.

ఎప్పుడైతే సదరు భూమిని టూరిజం శాఖ ఒబెరాయ్ హోటల్ కు కేటాయించినట్లు తెలిసిందో అప్పటి నుండి హిందూ సంఘాలు, స్వామీజీలు, భక్తులు, పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో 2024 నవంబర్ 18వ తేది జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో రెషల్యూషన్ నెం: 102 ప్రకారం ఆ పవిత్రమైన భూమి ఒబెరాయ్ హోటల్ కు చెందకుండా టీటీడీకి కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించడం జరిగింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది మార్చి 21వ తేదిన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన సందర్భంగా ఏడు కొండలకు ఆనుకుని ఉన్న పవిత్ర ప్రదేశంలో ఎలాంటి అపవిత్ర కార్యాకలాపాలకు వీలు లేకుండా చేస్తామని చెప్పారు.

ఈ క్రమంలో ఉత్తరం వైపు స్వామి పాదాల చెంత ఆనుకుని ఉన్న భూమిని టీటీడీకి ఇవ్వడానికి అంగీకరిస్తూ సదరు భూమికి బదులుగా రోడ్ కు అవతల వైపు భూమి ని కేటాయించాలని టూరిజం శాఖ కోరడమైనది.

దీనిపై 2025 మే 7వ తేదిన జరిగిన బోర్డు సమావేశంలో రెషల్యూషన్ నెం: 250 ప్రకారం భూ బదలాయింపునకు అంగీకారం తెలుపుతూ టీటీడీ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది.

ఈ క్రమంలో అలిపిరిలోని స్వామి పాదాల చెంత ఉన్న టూరిజం భూమిని టీటీడీకి , అదేవిధంగా రోడ్డుకు దక్షిణం వైపుగా ఉన్న టీటీడీ భూమిని టూరిజం శాఖకు బదలాయించేందుకు 2025 జూలై 22వ తేదిన జరిగిన బోర్డు సమావేశంలో రెషల్యూషన్ నెం: 385 ప్రకారం ఆమోదం తెలపడం జరిగింది.

తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో రోడ్డుకు ఉత్తరం వైపుగా ఉన్న పవిత్రమైన భూమిని భక్తుల సౌకర్యాల కల్పన నిమిత్తం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినియోగించుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అలిపిరి-చెర్లోపల్లి రోడ్డులో దక్షిణం వైపు ఇప్పటికే పలు నిర్మాణాలు జరిగిన విషయం విదితమే. ఈ కారణంగా దక్షిణం వైపు ఉన్న భూమిని టూరిజం శాఖకు కేటాయించి, తిరుమల కొండకు ఆనుకుని ఉత్తరం వైపుగా ఉన్న పవిత్రమైన భూమిని టీటీడీ తీసుకోవడం జరిగింది.

తిరుమల పవిత్రత, భద్రత దృష్ట్యా అలిపిరి రోడ్డులోని తిరుమల కొండకు ఆనుకుని ఉన్న ఉత్తరం వైపు ప్రాంతం టీటీడీకి కీలకమైనది. వాస్తవాలు ఇలా ఉండగా భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై ఆరోపణలు చేయడం సబబు కాదు.

Related posts

అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌

Satyam News

ముంబైలో ఘోరం: గాల్లో ఆగిపోయిన మోనోరైళ్లు

Satyam News

అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!