వైసీపీ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. తాజాగా శ్రీశైలంపై రాజకీయ రగడ ప్రారంభించింది. శ్రీశైలం ఆలయం తమకే కావాలని ప్రకాశం జిల్లా వైసిపి నేతలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. శ్రీశైలం దేవస్థానం మొత్తాన్ని మార్కాపురం కొత్త జిల్లాలో కలపాలని వారు డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టారు.
అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు మార్కాపురం వైసీపీ నేతల డిమాండ్ పై మండిపడుతున్నారు. చారిత్రక సంపదను తాము ఎలా వదులుకుంటామని సీమలోని వైసీపీ నేతలు కూడా అంటున్నారు. మార్కాపురం వైసీపీ నేతల డిమాండ్ కు వ్యతిరేకంగా పోరుకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉండగా శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే ఉంటుందని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు.