తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త డిపో నిర్మాణం, బస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్, పునరుద్ధరణ, ఆధునీకరణ పనుల కోసం రూ.108.02 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
పనులు చేపట్టబోయే బస్ స్టేషన్లు, డిపోలు:
మద్గుల్, నాగర్ కర్నూల్ డిపో, మహబూబ్ నగర్, రెగొండ, వేములవాడ, గంగాధర, నిజామాబాద్, ఘన్‌పూర్, పాల్వంచ, మునుగోడు, చండూర్, చౌటుప్పల్, ఐజా, వనపర్తి, పెబ్బైర్, కొల్లాపూర్, పెంట్లవెల్లి, దమ్మపేట, మండలపల్లి, అశ్వరావుపేట డిపో, హుస్నాబాద్ డిపో, కథలాపూర్, గోదావరిఖని, గూడూరు, మర్రిగూడ, నెక్కొండ, నర్సంపేట, వలిగొండ బస్ స్టేషన్లు.
నర్సంపేట బస్ స్టేషన్‌లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ షాపింగ్ కాంప్లెక్స్.
నెక్కొండ బస్ స్టేషన్‌లో షాపింగ్ కాంప్లెక్స్.
ఈ పనులను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ నిర్వీర్యమై ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, మహాలక్ష్మి పథకం ద్వారా నూతన బస్సుల కొనుగోలు, కొత్త బస్సు డిపోలు, బస్ స్టేషన్ల అభివృద్ధి, ఆధునీకరణ పనులు ప్రారంభించామని తెలిపారు. ప్రయాణికుల భద్రత, ఉద్యోగుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ అనే మూడు ప్రధాన విధానాలతో ఆర్టీసీ ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.