బ్యాంకులను మోసం చేసి కోట్ల రూపాయల రుణం పొంది ఆర్థిక నేరానికి పాల్పడిన కేసులో నిందితులకు లబ్ది చేకూర్చాలని చేసిన కుట్రలో భాగస్వామ్యం ఉండటంతో రమేష్ అనే వ్యక్తిని వనపర్తి అరెస్ట్ చేశామని వనపర్తి పోలీస్ సిఐ కృష్ణ తెలిపారు. వనపర్తి పట్టణానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ రాకేష్ కేసులో కుట్ర పూరితంగా వ్యవహరించినందుకు నిందితుడైన వనపర్తి పట్టణ వాసి రమేష్ ను వనపర్తి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బ్యాంకులను మోసం చేయడానికి బ్యాంక్ నుండి పొందిన రుణంతో వేరే ఆస్తులు కొని రాకేష్ కు సహకరించడం కోసం రమేష్ ఏజిపిఏ చేసుకున్నట్లు గుర్తించామని సీఐ తెలిపారు. రాకేష్ చేసిన ఆర్థిక నేరంలో రమేష్ కుట్రలో భాగస్వామ్యం ఉందని విచారణలో తేలినందున అరెస్ట్ చేసి రిమాండ్ చేశామని అన్నారు. ప్రభుత్వ సంస్థలు లేదా ప్రైవేటు సంస్థలను వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా కుట్రచేసి మోసం చేస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్