ప్రత్యేకం హోమ్

సమస్యల వలయంలో చిక్కుకున్న ఎయిర్ టెల్

#Airtel

దేశంలోని అన్ని మొబైల్ నెట్ వర్క్ లు ఒక్క సారిగా సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. సోమవారం భారతదేశంలో అన్ని మొబైల్ నెట్‌వర్క్ వినియోగదారులు దీర్ఘకాలిక అంతరాయం ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఎయిర్‌టెల్‌తో ప్రారంభమై, కొంతమేరకు జియో మరియు వోడాఫోన్-ఐడియాకు కూడా ఈ సమస్య విస్తరించింది.

డౌన్‌ డిటెక్టర్ ప్రకారం, ఎయిర్‌టెల్‌లో ఎక్కువగా ఫిర్యాదుల వచ్చాయి అందిన ఫిర్యాదులు అన్నీ కూడా మొబైల్ ఫోన్ కాల్స్‌కు సంబంధించినవే. తరువాత సిగ్నల్ కోల్పోవడం, ఇంటర్నెట్ సమస్యలు నమోదయ్యాయి. ఈ సమస్య తొలుత ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గుర్తించబడింది. తర్వాత ముంబై, బెంగళూరులోనూ, ఆపై దేశవ్యాప్తంగా విస్తరించింది.

కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో, “మా ఢిల్లీ-ఎన్‌సీఆర్ కస్టమర్లు గత గంట నుంచి వాయిస్ కాలింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. సమస్యలోని ప్రధాన భాగాన్ని ఇప్పటికే పరిష్కరించాం. మా ఇంజనీర్లు దీన్ని పూర్తిగా సరిచేయడానికి కృషి చేస్తున్నారు. కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం” అని పేర్కొంది.

టెక్ సమస్యలను పర్యవేక్షించే డౌన్‌డిటెక్టర్ పోర్టల్ ప్రకారం, సోమవారం సాయంత్రం 4:32 గంటల సమయంలో ఎయిర్‌టెల్ అవుటేజ్‌కు సంబంధించి 3,600 పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. సాధారణంగా 15 లోపే ఉండే బేస్‌లైన్‌తో పోలిస్తే ఇది భారీగా పెరిగింది. అయితే, సాయంత్రం 6:40 గంటలకు ఫిర్యాదులు 400 కంటే తక్కువకు తగ్గాయి. ఇప్పుడు కస్టమర్లు సేవలు పునరుద్ధరించబడ్డాయని ఎయిర్‌టెల్ నుంచి సందేశాలు అందుకుంటున్నారు.

Related posts

సైఫన్ గేట్లు తెరుచుకున్న సరళాసాగర్

Satyam News

రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట

Satyam News

రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించేది లేదు

Satyam News

Leave a Comment

error: Content is protected !!