క్రీడలు హోమ్

సానియా తో అర్జున్ టెండుల్కర్ ఎంగేజ్మెంట్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడైన అర్జున్, ప్రముఖ వ్యాపారవేత్త రవిఘాయ్ మనవరాలు సానియా చంధోక్‌తో ప్రైవేట్ కార్యక్రమంలో ఉంగరాలు మార్పిడి చేసుకున్నారు. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహిత మిత్రులే హాజరయ్యారు.

టెండూల్కర్ కుటుంబం ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ, అర్జున్ మరియు సానియా ఉంగరాలు మార్పిడి చేసుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీనితోపాటు, అభిమానులు వాళ్లిద్దరిని కలిసి ఉన్న పాత ఫోటోలు తవ్వి బయటకు తేవడం ప్రారంభించారు. వాటిలో కొన్ని ఫోటోలలో సానియా, అర్జున్ సోదరి సారా టెండూల్కర్‌తో కలిసి ఫోజ్ ఇవ్వడం కనిపిస్తుంది.

సానియా ముంబైలోని ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవారు. ఆమె రవిఘాయ్ మనవరాలు, Graviss Group అధినేత. ఈ గ్రూప్ హాస్పిటాలిటీ, ఫ్రోజన్ ఫుడ్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారాలు నడుపుతోంది. మరీన్ డ్రైవ్‌లో ఉన్న ఐకానిక్ InterContinental హోటల్, Kwality ఐస్ క్రీమ్, Brooklyn Creamery వంటి బ్రాండ్లు ఈ కుటుంబానికి చెందినవి. సానియా తండ్రి గౌరవ్ ఘాయ్ ప్రస్తుతం ఈ వ్యాపార వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

అతిగా ప్రాచుర్యంలో ఉండకుండా, సానియా సాధారణ జీవనశైలిని ఎంచుకున్నారు. సెలెబ్రిటీ వర్గాల నుంచి దూరంగా ఉండే ఆమె, సారా టెండూల్కర్‌తో దగ్గర సంబంధం కలిగి ఉన్నారు. అలాగే సచిన్ టెండూల్కర్‌తో కూడా ఆమెకి మంచి అనుబంధం ఉన్నట్టు సమాచారం.

Related posts

పాక్ తో క్రికెట్ మ్యాచ్ బాయ్ కాట్

Satyam News

ఎర్ర చందనం స్మగ్లర్ల వేట

Satyam News

ఉక్రెయిన్ తో యుద్ధం ఆపకుంటే తీవ్ర పరిణామాలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!