ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఢిల్లీ ప్రయాణం ఆసక్తికరం గా మారింది. కూటమి ఉప రాష్ట్ర పతి అభ్యర్థి ఎంపిక విషయం, ఆ తర్వాత నామినేషన్ల ఘట్టం లో వీరిద్దరూ పాల్గొంటున్నారు.
ఆ పరిణామాల మధ్య మన నిధులు, సమస్యల గురించి కూడా చర్చించి సానుకూలంగా మలచుకోడానికి ఇదో మంచి సందర్భం. ప్రతి అవకాశాన్ని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించడంలో శ్రమిస్తున్న తండ్రీ తనయుల ప్రయాణం మన రాష్ట్రానికి మేలు చేస్తుందని ఆశిద్దాం.
ఎటువంటి ఆహ్వానం లేకున్నా భేషరుతుగా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థికి, కేసుల కోసం మద్దతు ఇచ్చి సహకరించబోతోంది వైకాపా.
ఇవాళ రాత్రి ఢిల్లీ కి మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. రేపు పలువురు కేంద్రమంత్రులను మంత్రి లోకేష్ కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత మంగళవారం ఉదయం అమరావతికి చేరుకుంటారు. రేపు రాత్రి ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఈనెల 20న ఢిల్లీలో సమావేశంకానున్న ఎన్డీఏ నేతలను ఆయనకలుస్తారు. ఎన్డీఏ నేతల సమావేశానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరు అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులతో భేటీ అవుతారు.