ప్రత్యేకం హోమ్

విశాఖ ఇక ‘‘డిజిటల్ సిటీ’’

#Lokesh

ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో నిర్మాణం కానున్నది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో ఈ గూగుల్ డేటా సెంటర్ గేమ్ ఛేంజర్‌గా మారబోతున్నది. విశాఖపట్నంలో 6 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతున్నది.

తొలి దశలో ఒక గిగావాట్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తారు. గూగుల్ డేటా ఏర్పాటును ధృవీకరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా ట్వీట్ చేసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కూడా అధికారికంగా ధ్రువీకరించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఐటీ రంగంలో కొత్త మైలురాయిగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టును తీసుకురావడానికి విశేషంగా కృషి చేశారు.

అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడుతున్న విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం “డిజిటల్ ఆంధ్రప్రదేశ్” వైపు దిశగా ఒక కీలక ముందడుగుగా పేర్కొంది. ఈ డేటా సెంటర్‌లో ఒక లక్ష టెరాబైట్‌ల డేటా నిల్వ చేయగల సామర్థ్యం ఉండనుంది. 24 గంటల విద్యుత్ సరఫరా, అత్యాధునిక కూలింగ్ సిస్టమ్‌లు, సైబర్‌ సెక్యూరిటీ రక్షణలు ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు.

క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలకు ఇది కేంద్ర బిందువుగా నిలవనుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అమలు అయితే, లక్షలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టికానున్నాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెయింటెనెన్స్ రంగాల్లో విస్తృత అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా బహుళజాతి టెక్ దిగ్గజాలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

ప్రాజెక్ట్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయింపు, విద్యుత్–నీటి సౌకర్యాలు, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా వేగంగా లభిస్తున్నాయి. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విశాఖపట్నం అంతర్జాతీయ ఐటీ మ్యాప్‌లో ప్రముఖ స్థానం సంపాదించనుంది.

టెక్నాలజీ రంగంలో గ్లోబల్ హబ్‌గా ఎదగడమే కాకుండా, “డిజిటల్ సిటీ”గా విశాఖ గుర్తింపు పొందనుంది. ఆంధ్రప్రదేశ్ తీర నగరం అయిన విశాఖపట్నం త్వరలో ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్‌ రాబోతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇప్పటికే పతాక శీర్షికల్లో ప్రధానంగా పేర్కొన్నాయి.

అంతర్జాతీయంగా కూడా అతి పెద్ద పెట్టుబడితో రానున్న ఈ ప్రముఖ కేంద్రం పలు టెక్ దిగ్గజాలను ఆకట్టుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో టెక్ దిగ్గజాలు, గ్రీన్ ఎనర్జీ హబ్ లు, పారిశ్రామిక కారిడార్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ లు రావడం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

అసభ్యకరమైన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉద్వాసన

Satyam News

తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించాలి

Satyam News

నేపాల్ నుంచి భారత్ కు ప్రత్యేక విమానాలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!