పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు కల్పన దిశగా సీఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎల్లారెడ్డి గూడ జయప్రకాష్ నగర్ కాలనీ, ఇంజనీర్స్ కాలనీలో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ హైదరాబాద్ విశ్వ నగరం అజెండాగా అభివృద్రి చేయాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు.
జూబ్లీ హిల్స్ నియోజక వర్గంలో ప్రతి డివిజన్ లో సీసీ రోడ్లు ,పార్క్ లు తాగునీటి సరఫరా డ్రైనేజ్ వ్యవస్థ శానిటేషన్ తో క్లీన్ అండ్ గ్రీన్ గా కాలనీలు ఉంచి ,పరిశుభ్రత పాటిస్తూ మెరుగైన జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.హైదరాబాద్ నగర అబివృద్ధి కొనసాగేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కార్పొరేటర్ సంగీత స్థానిక నాయకులు పాల్గొన్నారు.