మంత్రి నారా లోకేష్ మరోసారి సక్సెస్‌ఫుల్ లీడర్ అనిపించుకున్నారు. నేపాల్‌లో అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న ఆంధ్రులను తిరిగి ఏపీకి సురక్షితంగా తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. దాదాపు 2 రోజులపాటు ఆయన చేసిన కృషి ఫలించింది. నేపాల్‌లో చిక్కుకున్న ఆంధ్రులు క్షేమంగా ఏపీకి చేరుకున్నారు.
నేపాల్‌లో గత 4-5 రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి తెలిసిందే. అల్లర్ల కారణంగా ఆ దేశ ప్రధానమంత్రి సహా అంతా దేశం విడిచిపారిపోయారు. ఐతే ఏపీ నుంచి వెళ్లిన పలువురు అక్కడే చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న నారా లోకేష్..వెంటనే రంగంలోకి దిగిపోయారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మంకగా అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
అధికారులతో సమన్వయం చేసుకున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న వారందరిని ఒకే చోటకు రప్పించి వారి కోసం ప్రత్యేక విమాన ఏర్పాటు చేశారు. వారంతా ఆ ప్రత్యేక విమానంలో ఏపీకి చేరుకున్నారు. కొంతమందిని విశాఖలో, మరికొంత మందిని తిరుపతిలో దిగబెట్టారు. ఏపీకి సురక్షితంగా చేరుకున్న వారి ఆనందానికి అవధుల్లేవు. విమానం ల్యాండ్ అవుతుండగానే ప్రయాణికులంతా జయహో చంద్రబాబు జయహో నారా లోకేష్ నినాదాలతో హోరెత్తించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
తెలుగువాళ్లు కష్టాల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ ముందుంటుందని మరోసారి నిరూపించారు లోకేష్. గతంలోనూ అనేక సందర్భాల్లో ఇది నిరూపితమైంది. ఉత్తరాఖండ్, సిమ్లా వంటి ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని కూడా ప్రత్యేక విమానాల్లో తీసుకు వచ్చిన చరిత్ర టీడీపీకి ఉంది. 2014లో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సిమ్లాలో బియాస్ నదిలో విద్యార్థుల గల్లంతు అయిన ఘటనలోనూ టీడీపీ వేగంగా స్పందించి బాధితులకు భరోసా అందించింది. అధికారంలో లేనప్పుడ కూడా బాధితులకు తోచిన విధంగా ఆపన్నహస్తాన్ని అందించింది.
నారా లోకేష్ చేసిన కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి నాయకులు మాకు ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. విషయం తెలియగానే రంగంలోకి దిగిపోయారు లోకేష్. అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఫోన్‌లో బాధితులతో మాట్లాడుతూ అండగా నిలిచారు. లోకేష్ కృషికి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.