నిజామాబాద్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరధ్ మరోసారి లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో చర్లపల్లి జైలులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే సమయంలో ఖైదీ భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తాజాగా కామారెడ్డి జైలులో జూనియర్ అసిస్టెంట్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా మెజిస్ట్రేట్ విచారణ జరిపినట్లు సమాచారం. ఒకేసారి వరుస కేసులు రావడంతో జైలు సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
previous post