ప్రత్యేకం హోమ్

సత్తిబాబు చర్యలతో జగన్ గుండెల్లో గుబులు

#BotsaSatyanarayana

వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వై ఎస్ షర్మిల అంటే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడుతున్న విషయం తెలిసిందే. పిసిసి అధ్యక్షురాలు షర్మిల తన అన్న అని కూడా చూడకుండా తీవ్రంగా విమర్శిస్తుంటారు. అన్నా చెల్లులు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్న సమయంలో జగన్ పాపం పుణ్యం కూడా చూడకుండా సోషల్ మీడియాలో తన చెల్లెలుపై దారుణమైన కామెంట్లు పెట్టిస్తుంటారు. వారి సొంత మీడియాలో అయితే వై ఎస్ షర్మిల అని ఎక్కడా రాయరు. తప్పనిసరిగా రాయాల్సి వస్తే కేవలం షర్మిల అని మాత్రమే రాస్తారు.

తాజాగా బొత్స సత్యనారాయణ చేసిన ఒక చర్యతో జగన్ అగ్గిమీద గుగ్గిలం లా మండిపడుతున్నారని అంటున్నారు. విశాఖ ఉక్కు పై విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాగా అప్పటికే వచ్చి కూర్చున్న వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ ఆమెను చూసి గౌరవ సూచకంగా లేచి నిలబడుతూ ‘రా అమ్మా.. ఇక్కడ కూర్చో’ అంటూ తన పక్క నున్న కుర్చీని చూపించారు.

అందులో కూర్చున్న షర్మిల.. బొత్స, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. సమావేశ అనంతరం ‘అన్నా వెళ్లొస్తా’ అంటూ బొత్సకు నమస్కరించారు. రోజు రోజుకూ వైకాపా వెంటిలేటర్ మీద ఎగస్వాస పీలుస్తోంది. ఉత్తరాంధ్రా నుండి సీనియర్ నాయకుడైన బొత్సా కాంగ్రెస్స్‌లో కర్చీఫ్ వేసి, తాల్లి లాంటి కాంగ్రెస్స్‌లోకి  తిరిగి రావడానికి సిద్ధం అనే సంకేతాలు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.

బొత్సా గత ఎన్నికల్లో ఓడిపోయి, తాజాగా వైకాపాలో ఎమ్మెల్సీగా వున్నాడు. షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యింది. వైకాపాలో క్రింది స్థాయి కార్యకర్తతో కూడా షర్మిళ వ్యక్తిత్వ హననం చెయ్యించింది వైకాపా. తాజాగా నా కొడుకు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడు అని ప్రకటించగానే.. ఆమె కొడుకు పేరు మీద మండి పడింది వైకాపా. ఈ విషయం తెలిసి, వైకాపా అధిష్టానం తనను సస్పెండ్ చెయ్యాలని, కావాలని ఇలా ఓవర్ యాక్షన్ చేశాడు అని వైకాపా నాయకుల భావన. ఈయన విషయంలో ప్యాలస్‌లో బీపీలు పెరిగినా.. తాడేపల్లి అధిష్టానం చర్యలు తీసుకొనే ధైర్యం ఇప్పుడు చెయ్యలేందు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

విద్యార్థిని పుర్రె ఎముకకు గాయమయ్యేలా కొట్టడం దారుణం

Satyam News

రాయచోటిలో వర్ష బీభత్సం: నలుగురు మృతి

Satyam News

ఎమ్మెల్యే నారాయణరెడ్డిని కలిసిన డిగ్రీ విద్యార్థులు

Satyam News

Leave a Comment

error: Content is protected !!