మహబూబ్ నగర్ హోమ్

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల వల్ల ఏ ప్రమాదం సంబవించిన వెంటనే పోలీస్ వారికీ సమాచారం అందించాలని, ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పట్లతో పోలీస్ అధికారులను, సిబ్బందిని సిద్ధం చెయ్యడం జరిగిందనీ జోగుళాoబ గద్వాల్ జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు తెలిపారు.

వర్షాల వల్ల ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని, రహదారుల పై గాని , ఇతర ప్రదేశాల లో ఏ సమస్యా తలెత్తిన వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్&బి, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వర్షాల వల్ల కలిగే ప్రమాదాల పై స్పందించే విధంగా పోలీస్ అధికారులను సిద్దం చెయ్యడం జరిగిందనీ అన్నారు.

కృష్ణ , తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెలు, పశువులు కాపరులు అటువైపు గానీ , వాగులు, వంకలు వైపు వెళ్లవద్దని, గ్రామాలలో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకునేందుకు గస్తీ పోలీసులను అప్రమత్తంగా ఉండేలా ఆదేశించినట్లు ఎస్పీ గారు తెలిపారు .

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల ఏదైనా విపత్కర సమస్య వస్తే లోకల్ పోలీస్ అధికారులకు లేదా డయల్- 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 70306 నెంబర్లకు సమాచారం అందించినచొ తక్షణ సహాయక రక్షణ చర్యలు పోలీస్ అధికారులు చేపడతారని జిల్లా ఎస్పీ తెలిపారు.

జిల్లా ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించగలరు.

1) వర్షానికి తడిసిన విద్యుత్ స్థంబాలను, గోడలను తాకరాదు, వాటికి కరెంట్ షాక్ వచ్చి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.

2) ఇనుప వైర్ లపై గృహిణి లు బట్టలు ఆరవేయరాదు కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది.

3) ఇంటి పై కప్పుగా వేసిన ఇనుప రేకులను తాకరాదు.

4) శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ,మట్టీ గోడలు తో ఉన్న ఇళ్ళలో, ఉదృతంగా ప్రవహించే నాలల దగ్గర ఉండే నివాసలలో ఉండకండి,అవి ఊహించని విధంగా కూలిపోయి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.

5) రైతులు మీ వ్యవసాయ బావుల వద్ద ,బోర్ ల వద్ద కరెంట్ పెట్టె ముందు తడిసిన స్టార్టర్ బాక్స్ లను,ఫ్యుజ్ బాక్స్ లను చేతులతో ముట్టుకోరాదు.

6) వరద నీటికి చెరువులు,కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉంటుంది. కావున ప్రజలు అప్రమత్తం గా ఉండగలరు.

7) చిన్నపిల్లలు మరియు ఈత రానివారు ఎట్టిపరిస్థితుల్లో కూడా చెరువు లోకి ఈత కు గాని లేదా చేపల వేటకు గాని వెళ్ళరాదు. తల్లిదండ్రులు పిల్లలను బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

8) వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి. వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి , గుంతలు ఏర్పడి , అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి.

9) వరదల వలన డ్రైనేజి కాలువల మ్యాన్ హోల్స్ వాటికవే తెరువబడి ఉంటాయి కావున జాగ్రత్త గా ప్రయాణించగలరు.

10) వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నపుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయకండి.11.అవసరమైతేనే ప్రయాణాలు చేయాలి.

Related posts

ఎర్ర చందనం స్మగ్లర్ల వేట

Satyam News

మంగళగిరిని మంత్రి లోకేష్‌ ఏం చేయబోతున్నారు?

Satyam News

సనత్ నగర్‌లో రావణ దహనంలో పాల్గొన్న తలసాని

Satyam News

Leave a Comment

error: Content is protected !!