హైదరాబాద్ హోమ్

హృద్రోగానికి తొలిసారిగా అల్ట్రా-ఫాస్ట్ Q-డాట్ అబ్లేషన్

#HolisticHospitals

శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ దక్షిణాసియా మరియు భారతదేశంలో తొలిసారిగా అల్ట్రా-ఫాస్ట్ Q-డాట్ అబ్లేషన్ టెక్నాలజీను హృదయ సంబంధిత అట్రియల్ ఫైబ్రిలేషన్ (AF) వ్యాధి చికిత్స కోసం విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది భారతీయ హృదయ శాస్త్రంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఈ ఆధునిక ప్రక్రియను ప్రొఫెసర్ డా. వి. ఎస్. రామచంద్ర, చీఫ్ కార్డియాలజిస్ట్ & ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఇప్పటికే ఏడు మంది రోగులపై విజయవంతంగా అమలు చేసింది.

Q-డాట్ అబ్లేషన్ టెక్నాలజీ ఏమిటి?

అట్రియల్ ఫైబ్రిలేషన్ (AF) అనేది గుండె అసమానంగా మరియు వేగంగా కొట్టుకునే పరిస్థితి. ఇది స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ మరియు ఇతర సమస్యలకు దారి తీసే ప్రమాదం ఎక్కువ.

ఈ సమస్యను పరిష్కరించడానికి రూపొందించిన Q-డాట్ అబ్లేషన్ సిస్టమ్ ప్రత్యేకతలు:

అధిక శక్తి, ఉష్ణోగ్రత నియంత్రిత రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో గుండెలోని లోపభూయిష్టమైన ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ను ఖచ్చితంగా లక్ష్యం చేస్తుంది.

సాంప్రదాయ అబ్లేషన్‌తో పోలిస్తే ఇది వేగంగా పూర్తవుతుంది, తద్వారా సమయం తగ్గడమే కాకుండా రేడియేషన్ ప్రభావం కూడా తగ్గుతుంది.

రోగులకు వేగవంతమైన కోలిక, తక్కువ సమస్యలు మరియు మెరుగైన దీర్ఘకాల ఫలితాలు లభిస్తాయి.

ఈ విజయంతో, భారతదేశానికి అత్యాధునిక గ్లోబల్ కార్డియాక్ ఇన్నోవేషన్స్‌ను పరిచయం చేస్తూ, సంపూర్ణ హోలిస్టిక్ హెల్త్‌కేర్ అందించడంలో శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ మరో ముందడుగు వేసింది.

Related posts

బ్రిటీష్ పాలకుల కన్నా ఘోరం ఈ వైసీపీ నేతలు

Satyam News

భారత్ లో రూ.5.5 లక్షల కోట్ల పెట్టుబడికి జపాన్ సిద్ధం

Satyam News

చీకటి పొత్తులకు బ్రాండ్ అంబాసిడర్ జగన్

Satyam News

Leave a Comment

error: Content is protected !!