సినిమా హోమ్

రజనీ పవర్ అర్థమైందా రాజా….

కూలీ సినిమాతో ఈ వయసులో 500 కోట్ల దిశగా రజినీకాంత్ దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రానికి విచ్చేసి ఎన్టీఆర్ ను, తన మిత్రుడు చంద్రబాబు ను పొగిడారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఒకే ఒక్క మాట వైకాపా గురించి కానీ.. జగన్ గురించి కానీ మాట్లాడలేదు. అయినా వైకాపాలోని చిల్లర నాయకులు శునకాల లెక్కన ఆయన మీద మొరిగించింది వైకాపా.

వైకాపాను భుజాన మోసిన హీరోలు, వారి వారసులు గోళ్లు గిల్లుకొంటున్నారు. కథలో దమ్ముంటే ఎవరూ ఆపలేరు అనే వాదన వుంది. ఇవ్వాళ హీరోలకు మించిన కల్ట్ రాజకీయ పార్టీ అయిన టీడీపీకి వుంది. దానికి కోటిమందికి పైగా పారదర్శకంగా డిజిటల్ పేమెంట్ చేసి సభ్యత్యం తీసుకున్న సభ్యులు వున్నారు.

ఒకసారి మనసు విరిగితే.. కథలో ఎంత దమ్మున్నా వైకాపా లాంటి సైకో పార్టీతో అంటకాగితే హీనంగా చూసి, ఓటీటీలో చూడడానికి కూడా ఇష్టపడని కార్యకర్తలు లక్షల్లో వున్నారు.

ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి వస్తాయి. సంక్షేమం, అభివృద్ధి, నాకేంటి, కులాలు గట్రా మీద జరుగుతాయి. ఆ లోపు సినిమా పండగలు చాలా వస్తాయి. పార్టీలకు ముడిసరుకు అయితే బాక్సాఫీసులు ప్రక్కనబెడితే.. కటౌట్లు కట్టడం ప్రక్కనబెడితే.. ఏ సినిమా వస్తోంది పోతోంది అని కూడా పట్టించుకోరు.

దుష్ట సావాసం దుడ్డు పోయినా పర్లేదు దూరం పెట్టాలి అంటారు. ఇలాంటి రోతగాళ్లు, బూతుగాళ్లతో వాగించినా ఊడేది ఏమీ వుండదు. అర్థం అయ్యిందా రాజా?

Related posts

తిరుమల పరకామణి చోరీలో సంచలన విషయాలు….

Satyam News

భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా?

Satyam News

సోషల్ మీడియా సైట్లపై నిషేధం: భగ్గుమన్న నేపాల్

Satyam News

Leave a Comment

error: Content is protected !!