వనపర్తి జిల్లా కేంద్రంలోని 33వ వార్డు రిలయన్స్ స్మార్ట్ దగ్గర వర్షానికి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దిమ్మె కూలి కింద పడిందని మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ ఏఈ సుధాకర్ కు తెలుపగా వెంటనే సిబ్బందితో వచ్చి విద్యుత్ అంతరాయం లేకుండా చేశారని చెప్పారు. ప్రస్తుతానికి మున్సిపల్ ట్రాక్టర్ ద్వారా మొబైల్ ట్రాన్స్ ఫార్మర్ ను తెప్పించి విద్యుత్తును కొనసాగించి వెంటనే మరమ్మత్తు చేసేందుకు తగు సూచనలు ఇచ్చి అప్రమత్తం చేశామన్నారు. ఈ విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదంలో ఉన్నదని అనేకమార్లు గత అధికారులకు మొరపెట్టుకున్న, వినతి పత్రాలు ఇచ్చిన నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ప్రస్తుత డి.ఇ., ఎ.ఇ వెంటనే స్పందించి పనులను ప్రారంభించారని అయన తెలిపారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్
