రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం పలువురు కుటుంబాల్లో విషాదాన్ని కలిగించింది. వరదనీటిలో కొట్టుకుపోయి తల్లీ-బిడ్డ షేక్ మున్నీ (27), ఇలియాస్ (6) మృతి చెందారు. మరో వ్యక్తి వంగల గణేశ్ (30) కూడా కాపాడే ప్రయత్నంలో మృతి చెందాడు. రామాపురం వద్ద స్కూల్ ఆటోలో నుంచి దూకేసి మాధవరం ఆరవ వాండ్లపల్లికి చెందిన ఆరవ యామిని (8) డ్రైన్ కాలువలో కొట్టుకుపోయి మరణించింది. ఈ ఘోర ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
previous post
next post