కడప హోమ్

గిరి బలిజ జీ ఓ రద్దు చెయ్యాలి

బలిజ కాపు వర్గాల సమస్య ల పరిష్కారం కోసం రాష్ట్ర కాపు జేఏసీ దశల వారి ఉద్యమం కొనసాగిస్తుందని రాష్ట్ర కాపు జేఏసీ ప్రకటించింది. గిరి బలిజ జీ ఓ ను నిరసిస్తూ రాయల సీమ పర్యటన లో భాగంగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ కడప జిల్లాలో పలు కార్యక్రమం లో పాల్గొన్నారు.

ఆదివారం కడపలో బలిజ సంఘాల నాయకులతో కలసి సమావేశం ఐ భవిష్యత్తు ప్రణాళిక పై చర్చించారు. ఈ సందర్భం గా మీడియా తో మాట్లాడుతు కూటమి ప్రభత్వ బలిజ కాపు వర్గాలపై కక్ష పూరిత ధోరణి విధానడాలని గిరి బలిజ జీ ఓ ను రద్దు చేయాలనీ గిరి బలిజ లో బలిజ తొలగించాల ని చందు జనార్దన్ డిమాండ్ చేసారు. దొమ్మారులను గౌరవించదాన్ని బలిజ వర్గాలు స్వాగతిస్థాయి.

కానీ బలిజ లో కలపదాన్ని విభేది స్తాము. గిరి బలిజ ప్రభుత్వ వైఖరి బలిజల పై దాడి గానే రాష్ట్ర కాపు జేఏసీ భావిస్తుంది. జనసేన అధినేత ఎన్నికల ముందు బలిజ కాపు వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాలని యస్ సి, యస్ టీ బి సి, మైనారిటీ వర్గాలను కలుపు కొని ముందు కెల్లాలని ఆదేశించారు కులం పాటించింది. రాష్టం లో అధికార మార్పిడి కావాలని పవన్ అన్నారు. బలిజ కాపులు మార్పిడి తెచ్చారు.

రాష్ట్రం లో కూటమిని అధికారం లోకి తెచ్చింది బలిజ కాపు వర్గాలు. మారేందుందుకు సామజికం గా ఆర్థికంగా రాజకీయం గా దాడులు కింసాగుతున్నాయి అని చందు జనార్దన్ ప్రశ్నించారు. రాష్టఓ లో అడిగికారం తెవడం ద్వారం కేంద్రం లో అధికారం తెచ్చిన ఘనత కూటమి ది దాన్ని తెచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ ది కారణం బలిజ కాపులది.

వెంటనే go 5 రద్దు చెయాలి. దమాషా ప్రకారం రాజకీయ, ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యత నివ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులు పై దాడులు అపి దమాషా ప్రకారం ప్రాధాన్యత గల స్థానాల్లో పోస్టింగ్ లు ఇవ్వాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ డి మాండ్ చేసారు.రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో ఎన్నోకల్లో అన్ని రాజకీయ పార్టీ లు బలిజల కు అన్యాయం చేశాయని ఓటు బ్యాంకు గా మాత్రమే వాడుకుంటూ మోసం చేస్తున్నారని చందు ఆవేదన వ్యక్తం చేసారు.

బలిజ కాపు, తెలగ ఒంటరి ల బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అంటూ బీసీ రిజర్వేషన్, బలిజ వర్గ సమస్యల కోసం దశల వారి ఉద్యమం కొనసాగిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చందు జనార్దన్ ప్రకటించారు.

శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగ జేఏసీ కన్వీనర్ సోమరౌతు రామకృష్ణ మాట్లాడుతు కూటమి ప్రభుత్వ హయం లో 15 నెలల కాలం లో నాలుగు డి ఏ లు పెండింగ్లో ఉన్నాయ్, పి ఆర్ సి చైర్మన్ ను ప్రకటించ లేదు. పి ఫ్ అకౌంట్ నగదు ఇవ్వడం లేదు, ఎన్నికల సమయం లో సి పి ఎస్ పరిష్కారం చేస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారని మాట నిలుపుకోవాలని సోమ రౌతు రామ కృష్ణ డిమాండ్ చేశారు.

ఈ సమావేశం లో పాల్గొన్న బలిజ సంఘంనేతలు సమతం రాము, చెన్నం శెట్టి మురళి, నాగరాజు, దాసరి శివప్రసాడ్ లు మాట్లాడుతూ రాయల సీమలో ఏ ప్రభుత్వం వచ్చిన బలిజ ల పై కక్ష సాధింపు కొన సాగుతుంద ని ఆవేదన వ్యక్తం చేసారు.కూటమి ప్రభుత్వం రావడానికి కృషి చేశామని దొమ్మరి కులాన్ని తెచ్చి బలిజల్లో కలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాబోయే కాలం లో మా వైఖరిని చూస్తారని హెచ్చరించారు.తోట రామ చంద్రయ్య, గోపిశెట్టి నాగరాజు, మస్తాన్ రాయల్, ప్రతాప్ రాయల్, సింగినాల శ్రీను, సుబ్రహ్మణ్యం, గంధం ప్రసాద్, పాల్గొన్నారు.

Related posts

విత్తన పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆఫ్రికా ప్రతినిధులు

Satyam News

బాణాసంచా తయారీ కేంద్రాలపై తనిఖీలు

Satyam News

ఏపీలో మూడు జిల్లాలకు రెడ్ అలెర్ట్

Satyam News

Leave a Comment

error: Content is protected !!