సంపాదకీయం హోమ్

పీపీపీ మోడల్ పై జగన్ కు ఎందుకు అంత కక్ష?

#YSJagan

ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP – Public-Private Partnership) మోడల్‌ను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) నేతలు కేవలం ‘ప్రైవేట్’గా అభివర్ణించడం విమర్శలకు తావిస్తోంది. దేశవ్యాప్తంగా వందలాది విద్యాసంస్థలు, ముఖ్యంగా వైద్య కళాశాలలు, విజయవంతంగా నడుస్తున్న ‘PPP’ నమూనాను పెదవి విరుపుతో వైకాపా చూడటంపై చర్చ జరుగుతోంది.

పీపీపీ నమూనాను పోలిన ‘ఎయిడెడ్’ (Aided) విద్యా వ్యవస్థను గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. పీపీపీ విధానంపై వారి వైఖరిని గమనిస్తూ.. ఛారిటబుల్ ట్రస్టుల ఆధ్వర్యంలో నడుస్తూ, ప్రజా సేవలో అగ్రస్థానంలో ఉన్న ఎయిడెడ్ సంస్థలపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుర్తు చేసుకొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 2,500 ఎయిడెడ్ విద్యా సంస్థలు (పాఠశాలలు, కళాశాలలు) దాదాపు 3.65 లక్షల మంది విద్యార్థులకు విద్యనందించాయి. ఇందులో 15,000 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పనిచేసేవారు. 2021 నాటికి 136 ఎయిడెడ్ కళాశాలలు ఉండేవి. ఈ సంస్థలు ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతూ, ప్రైవేట్ నిర్వహణలో కొనసాగాయి. 2021 ఆగస్టులో, జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ సంస్థలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది.

అప్పటి విద్యా మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎయిడెడ్ వ్యవస్థ ‘పెద్ద స్కామ్’, ‘డబ్బు వృథా’ అంటూ విమర్శించారు. ప్రభుత్వానికి అప్పగించడం లేదా ప్రభుత్వ గ్రాంటు పోస్టులను వదులుకుని పూర్తిగా ప్రైవేట్‌గా మారడం అనే రెండు ఎంపికలను ప్రభుత్వం ఇచ్చింది. ఎయిడెడ్ సంస్థలకు ప్రభుత్వం ఏటా రూ.500 కోట్లకు పైగా గ్రాంటుగా అందించేది.

ఈ విధానానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, పోరాటాలు చేపట్టాయి. అనంతపురంలోని ఎస్బీఎస్వైఎం కళాశాల విద్యార్థులపై లాఠీఛార్జి కూడా జరిగింది. నాటి ప్రతిపక్ష టిడిపి తీవ్ర ప్రతిఘటన తర్వాత, 2021 నవంబర్‌లో ప్రభుత్వం తన ఉత్తర్వులను సవరించింది. ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం ఐచ్ఛికం అని జగన్ స్పష్టం చేశారు.

పిపిపి నమూనాను పోలి ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా, లేదా పాక్షిక సహాయంతో, అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న అనేక ట్రస్ట్ ఆధారిత విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వీటిలో కొన్ని శతాబ్దపు చరిత్ర కలిగినవి కూడా వున్నాయి. దాతృత్వ, ట్రస్ట్ స్ఫూర్తితో ప్రభుత్వ లక్ష్యాలకు అండగా నిలుస్తూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.

పీపీపీ మోడల్ అనేది కేవలం డబ్బు సంపాదించే ప్రైవేట్ వ్యవహారం కాదనీ, ‘ప్రజోపయోగకరమైన లాభాపేక్ష లేని ట్రస్టులు / ప్రైవేట్ సహకారం’ అని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, వైఎస్సార్సీపీ యొక్క విమర్శలు, ఏపీలో వైద్య విద్య పురోగతికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని వైద్య, విద్యా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిపిపి నమూనాలో పద్దతిలో పనిచేసే తమ విద్యా సంస్థల మీద కూడా వైకాపా ఇదే వైఖరి అవలంభిస్తే పరిస్థితి ఎమిటా అని మైనారిటీ విద్యా సంస్థలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. అరవింద్ ఐ హాస్పిటల్, టాటా క్యాన్సర్ హాస్పిటల్, బర్డ్, స్వింస్ ఇలా తిరుపతి కేంద్రంగా పిపిపి నమూనాలో ట్రస్టుల ద్వారా వైద్యం అందించేవి వున్నాయి. అలాగే వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ చిత్తూరు సరిహద్దు దగ్గర వైద్యం అందిస్తోంది.

పిపిపి అంటేనే ప్రైవేటు సీట్లు అమ్ముకోడానికి అంటూ విమర్శించే వైకాపాకు నీట్ ద్వారా పారదర్శకంగా దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల సీట్లు ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు కేటాయిస్తారు అని తెలియదా? గత ఐదేళ్లలో వైకాపా ఏమన్నా కమీషన్లు వసూలు చేసిందా? ఆశ్చర్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో మొదటి సారిగా జగన్ పేమెంట్ సీట్లు తెచ్చి ఏమన్నా వసూలు చేశారా?  ఇలాంటి సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

Related posts

అమరావతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు

Satyam News

మరో 3 రోజులు భారీ వర్షాలు

Satyam News

లోకేష్‌…. టాప్ మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ లీడర్‌…!!

Satyam News

Leave a Comment

error: Content is protected !!