ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 9వ తేదీన పిఠాపురం నియోజక వర్గంలో పర్యటిస్తారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు. సముద్ర జలాలు కాలుష్యం అవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని… ఆ ప్రాంతం పరిశీలించేందుకు సముద్రంలో ప్రయాణించనున్నారు. అనంతరం ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పిఠాపురం నియోజక వర్గంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు
previous post