పదవ తరగతి ఫెయిల్ అయ్యాడని అందరూ చెప్పుకునే ఒక డివిజనల్ అధికారి పదోన్నతి పై మరో జిల్లాకు అధికారిగా వెళ్లారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? అందరికి ఇదే అనుమానం ఉంది కానీ ఎవరూ అందుకు తగిన సమాచారం ఇవ్వడం లేదు. ఈ ఘనుడు ఇంత వరకు ఏలూరు జిల్లా లో పని చేశారు.
ఏలూరు డివిజన్ లో విధులు నిర్వహిస్తున్న సమయం లో ఆయన పదవ తరగతి కూడా ఉత్తీర్ణత కాలేదని ఆ నోటా ఈ నోటా విన్న సమాచారం తో అసలు ఆ డివిజనల్ అధికారి గా ఏ విద్యార్హతతో ఉద్యోగం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయగా విస్తుపోయే విషయాలు తెలిశాయి.
ఆయన పనిచేసే కార్యాలయంలో సమాచార హక్కు ద్వారా ఆ అధికారి కి సంబంధించి 10వ తరగతి ఆ పైన ఉన్న విద్యార్హతల వివరాలు ఆడిగితే ఆ డివినినల్ అధికారి సర్టిఫికెట్స్ తమ కార్యాలయం లో లేవని ఏ పి రాజధాని అమరావతిలో కమీషనర్ కార్యాలయం లో ఉన్నాయని తెలిపారు. కమీషనర్ కార్యాలయానికి ఆర్ టి ఐ ద్వారా అర్జీ పెట్టి ఆ డివినల్ అధికారి విద్యార్హత లు, సర్వీస్ రికార్డ్ మొదటి పేజీ నుండి చివరి పేజి వరకు, ఆయన పై ఉన్న చార్జి మెమో ల వంటి వివరాలు నకళ్ల రూపం లో ఇవ్వాలని కోరగా ఆ వివరాలు ఆయన విధులు నిర్వహించే కార్యాలయం లో దరఖాస్తు పెట్టి పొందాలని సూచించారు.
మళ్ళీ ఏలూరులో దరఖాస్తు చేస్తే ఆయన విద్యార్హతలు గతం లో తూర్పు గోదావరి జిల్లాల్లో విధులు నిర్వహించారు అక్కడ ప్రయత్నించాలని ఏలూరు కార్యాలయ సిబ్బంది ఇచ్చిన ఉచిత సలహా ఇచ్చారు. కాకినాడ జెడ్ పి సీ ఈ ఓ కి ,రాజమండ్రి డి పి ఓ కార్యాలయాలకు దరఖాస్తు చేసినా అక్కడ అధికారులు కూడా తమ కార్యాలయం లో ఆ డివినినల్ అధికారికి సంబంధించిన విద్యార్హతల సర్టిఫికెట్స్ ఏమి లేవని తెలిపారు.
ఆయన పనిచేసే ఏలూరు డి పి ఓ కార్యాలయం లో ప్రయత్నించమని అక్కడి అధికారులు తెలిపారు. మళ్ళీ ఏలూరు డి పి ఓ కార్యాలయ సిబ్బందిని కోరగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డివిజనల్ అధికారికి సంబంధించిన విద్యార్హతలు ఇక్కడ కూడా లేవని తెలుపుతూ సదరు డివిజనల్ అధికారి విద్యార్హతలు అడిగే హక్కు బయట వ్యక్తులు ఎవరికి లేదని తెలిపారు.
అవి ఇవ్వకూడదని గౌరవ కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చిందని గౌరవ కోర్ట్ ఉత్తర్వుల కాపీ ఒకటి డివిజనల్ అధికారి విద్యార్హతలు అడిగే వారికి ఇవ్వమని సదరు అధికారి కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. ఆ కోర్ట్ ఉత్తర్వులలో లాస్ట్ పేరాలో ఏముందో తెలుసుకోకుండా ఆ కాపీని చేతికివ్వడం ఆశ్చర్యం. అంతే కాదు ఉద్యోగం లో జాయిన్ అయ్యి 15 ఏళ్ళు గడిచాక ఉద్యోగస్తుడి విద్యార్హతలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదని తెలపడం శోచనీయం.
డివిజనల్ పంచాయతీ అధికారికి సంబంధించిన విద్యార్హతలు సమాచార హక్కు ద్వారా అడిగిన అర్జీదారునికి తెలపాలని ఆ డివిజనల్ పంచాయతీ అధికారి ,ఏలూరు డి పి ఓ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. వాళ్ళ ద్వారా అర్జీదారునికి చెప్పించిన తీరు అడిగిన సమాచారం ఇవ్వకుండా తప్పించుకునేలా ఉందనేది తేట తెల్లం అయ్యింది.
ఆ డివిజనల్ అధికారి 10వ తరగతి పాస్ కాలేదని అధికారులందరికి తెలుసని చాలా మంది ఉద్యోగులు చెప్పుకోవడం విశేషం. 10వ తరగతి పాస్ కానప్పుడు ఆ సర్టిఫికెట్స్ ఎలా ఇస్తారు అని ఆయన పేక్ సర్టిఫికెట్స్ తో ప్రభుత్వాన్ని మోసం చేసి ఉద్యోగం చేస్తున్నాడేమో అని చాలా మంది ఆ శాఖ ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆయన పై ఎన్నో ఇలాంటి అవినీతి ఆరోపణలు ఉన్నా ప్రభుత్వం గాని ,సంబంధిత ఉన్నత స్థాయి ఉద్యోగులు గాని పట్టించుకోకుండా ఆయనకు జిల్లా అధికారిగా పదోన్నతి కల్పించడం పై చాలామంది పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులో విధులు నిర్వహించే సమయం లో జిల్లా అధికారులు ఆయనను ఏదైనా గ్రామం లో జరిగిన అవినీతి పై విచారణ జరపాలని ఆదేశిస్తే ఆయన జేబులు పిక్కటంగా నిండినట్టే.
ఆ గ్రామం లో విచారణ చేసే సమయం లో అవినీతికి పాల్పడిన ఉద్యోగుల తో చేతులు కలిపి అవినీతి జరిగిన మొత్తం సొమ్ములో 50 శాతం తనకు పర్సెంటేజ్ ఇచ్చేలా అవినీతికి పాల్పడి న ఉద్యోగితో బేరం కుదుర్చుకునేవారు. విచారణలను పక్కదారి పట్టించి కోట్లకు పడగలెత్తాడని సమాచారం. ఒక వేళ పిర్యాదు దారుడు మరో సారి పిర్యాదు చేస్తే అవినీతికి పాల్పడిన ఉద్యో విచారణకు సహకరించడం లేదని ,ఆ గ్రామానికి సంబందించిన రికార్డు అందుబాటులో లేదనే కారణాలు చూపి విచారణ శాశ్వతంగా వాయిదా వేస్తారని ఆ తరువాత ఆ విచారణ ఆటకెక్కిo చడం ఆ విచారణాధికారికి వెన్నతో పెట్టిన విద్య.
ఇదే అధికారి 100 కోట్లు అవినీతికి పాల్పడ్డాడని అప్పట్లో ఆంధ్రజ్యోతి దిన పత్రిక పతాక శీర్షికలో వార్త ప్రచురించినా ఈ అధికారి పై నేటికి చర్యలు చేపట్టాక పోగా జిల్లా అధికారిగా పదోన్నతి కల్పించడాన్ని ఏలూరు జిల్లాలో పలువురు అధికారులు గుస గుస లాడుకుంటున్నారు. ఇప్పటికి చాలా మంది అధికారులు ఆ డివినినల్ అధికారి నకిలీ సర్టిఫికెట్స్ ని అడ్డం పెట్టుకుని జిల్లా అధికారిగా కొనసాగుతున్నారని అనుమానిస్తున్నారు.