ఖమ్మం హోమ్

బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

#MalluBhattiVikramarka

వైరా నియోజకవర్గం ముసలిమడుగు గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో  ముచ్చటించారు. అధ్యాపకులు బోధిస్తున్న పాఠ్యాంశాలు అర్ధమవుతున్నాయా? 

మీరు బాగా చదువుతున్నారు? మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? డైట్ చార్ట్ ప్రకారం ఆహారం అందిస్తున్నారా? అని  బాలికలను ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాలికలు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం నిర్ణయించిన డైట్ మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారని చెప్పారు.

ప్రతిరోజు గుడ్డు, అదేవిధంగా చార్ట్ ప్రకారం చికెన్, మాంసాహార వంటలను అందిస్తున్నారని చెప్పారు. పాఠ్యాంశాలను అధ్యాపకులు చక్కగా బోధిస్తున్నారని స్టడీ అవర్స్ లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేస్తూ చదువు చెబుతున్నారని చెప్పారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురుకుల పాఠశాలలోని తరగతి గదులను, వంటశాలని తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు విద్యార్థినులకు డైట్ మెనూతో పాటు బాలికలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటుగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

రెగ్యులర్ షూటింగ్ లో భీమవరం టాకీస్ “మహానాగ”

Satyam News

మోసం చేసిన వైసీపీ నేత ఇల్లు ముట్టడి

Satyam News

గో సేవలో ఎక్సైజ్ శాఖ మంత్రి….

Satyam News

Leave a Comment

error: Content is protected !!