ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సీఎం సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు సునీల్, విజయశ్రీ, పులివర్తి నాని, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, అనురాధ, చిరంజీవి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, బీటీ నాయుడు, రామ్‌గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు, ఫారెస్ట్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణరంగారావు, తదితరులు పాల్గొన్నారు.