నల్గొండ హోమ్

రేపే 9 వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం

#KomatireddyRajgopalreddy

తన మాతృమూర్తి  కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద  మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరు  కంటి సమస్యలతో బాధపడొద్దనే ఆలోచనతో  ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. ఇప్పటివరకు 8 విడతలుగా నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలలో  5789 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 1248 మంది కి కంటి ఆపరేషన్లు పూర్తిచేశారు

మునుగోడు మండల ప్రజలకు మునుగోడు లో నిర్వహించి న మొదటి విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో  216 మందికి, రెండవ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో 108 మందికి, చండూరు మున్సిపాలిటీ ప్రజలకు మునుగోడు లో నిర్వహించిన మూడవ విడత  ఉచిత కంటి వైద్య శిబిరంలో  129 మందికి, నాంపల్లి మండలప్రజలకు నాంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన నాలుగవ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో 229 మందికి, మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన ఐదవ విడత కంటి వైద్య శిబిరంలో 171 మందికి, చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన ఆరవ విడత కంటి వైద్య శిబిరంలో 198 మందికి, గట్టుప్పల్ మండల కేంద్రం లో ఏడవ విడత  కంటి వైద్య శిబిరంలో 65 మందికి, నారాయణపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన 8 వ విడత వైద్య శిబిరంలో 132 మందికి ఆపరేషన్లు పూర్తి చేశారు.

మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి కి పెద్దకొడుకుగా మారి కంటి   ఆపరేషన్ లు చేయిస్తున్నారు… రాబోయే మూడున్నర సంవత్సరాలలో నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడకుండా ఉండాలని ప్రణాళిక రూపొందించారు..

ఆ ప్రణాళికలో భాగంగానే  10 పదివేల మందికి  కంటి శస్త్ర చికిత్సలు చేయించేలా టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే రేపు(21-9-2025) ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో  9 వ, విడత  ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు..తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఫీనిక్స్ ఫౌండేషన్  శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు..

చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన ఏర్పాట్లను స్థానిక నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు…చౌటుప్పల్ మున్సిపాలిటీలో ని   అన్ని వార్డులు, గ్రామాల ప్రజలు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని  సద్వినియోగపరుచుకోవాలని ఇప్పటికే  ఆయా వార్డులు గ్రామాలలో టామ్ టామ్ వేయించి ప్రచారం నిర్వాహించారు స్థానిక నాయకులు.

Related posts

ఫోన్‌ నెంబర్‌ పై జగన్ మోసం..షాకిచ్చే యోచనలో CBI..??

Satyam News

ఓపెన్‌ఏఐ భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు

Satyam News

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్టు

Satyam News

Leave a Comment

error: Content is protected !!