నెల్లూరు హోమ్

కిలేడీ అరెస్టు: నాటకాలు షురూ

కిలేడీ గా పేరు తెచ్చుకున్న నిడిగుంట అరుణని కోవూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అద్దంకి టోల్ ప్లాజా దగ్గర కిలేడీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నేడు అరెస్ట్ చేసి కిలేడీని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

ఇటీవల ఓ సీఐకి ఫోన్ చేసి, హోంశాఖ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ కిలేడీ బెదిరింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. జగన్ హయాంలో రౌడీషీటర్ శ్రీకాంత్ సహకారంతో కిలేడీ పలు నేరాలు, సెటిల్ మెంట్లు చేసిన విషయం తెలిసిందే. అరెస్టుకు ముందు కార్ డిక్కిలో దాక్కుని అరుణ సెల్ఫీ వీడియో చేసింది.

నన్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. నాపై ఏ కేసు పెట్టారో కూడా తెలియదు. నా ప్రాణాలు ఉంచుతారో, తీస్తారో కూడా తెలియదు. నా కారులో గంజాయి పెట్టి అక్రమ కేసు పెట్టాలని చూస్తున్నారు. నన్ను మీడియా మిత్రులు రక్షించాలని కోరుతున్నా అని నిడిగుంట అరుణ ఆ వీడియో లో పేర్కొన్నది.

అరెస్టుకు ముందే ఇలా షూట్ చేసి పెట్టుకొని, తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకొంగానే ఈ వీడియో వదిలారు బ్లూ మీడియా ద్వారా. మొదట్లో ఆ వీడియో చూసి, పోలీసులను అనుమానించారు అందరూ. కానీ కిలేడీ ముందుగానే షూటింగ్ ముగించింది.

చూస్తుంటే కిలేడీ గంజాయి వ్యాపారం కూడా చేసినట్లుంది. ముందుగానే ఇలా ఆరోపిస్తే పోలీసులు భయపడతారు అని మైండ్ గేమ్ మొదలెట్టినట్లుంది. ఇలాంటి కిలేడీకి వైకాపా క్రిమినల్సుకు కెమిస్ట్రీ కుదిరి ఎలాంటి అరాచకాలు చేసి వుంటారో. ఇన్నాళ్లకు ఇలా దొరికినా.. సజ్జల నుండి స్క్రిప్ట్ .. బ్లూ మీడియా నుండి సాయం, ఈ మహానటి నటన మామూలుగా లేదు అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

కలలకు సహకరించిన కుంచె

Satyam News

దేశవ్యాప్తంగా 5 వేల వేంకటేశ్వర ఆలయాలు

Satyam News

24 గంటల్లో చైన్ స్నాచింగ్ కేసు పరిష్కారం

Satyam News

Leave a Comment

error: Content is protected !!